Balayya: ఈసారి బాలయ్య బర్త్ డే అట్టా ఇట్టా ఉండదు… ట్రిపుల్ బొనాంజా ఖాయం
నిన్నగాక మొన్నొచ్చిన హీరోలే బర్త్ డే రోజు కొత్త సినిమాలంటూ నానా హంగామా చేస్తున్నారు.. మరిక్కడున్నది బాలయ్య.. ది బ్రాండ్..! ఆయన పుట్టిన రోజు హడావిడి ఏ రేంజ్‌లో ఉండాలి..? సందడి తగ్గితే బాలయ్య ఒప్పుకుంటారేమో కానీ ఫ్యాన్స్ మాత్రం దీనవ్వ తగ్గేదే లే అంటున్నారు. మరి అంతగా అభిమానులేం ప్లాన్ చేస్తున్నారు..? ఈ సారి బాలయ్య బర్త్ డే ఎలా ఉండబోతుంది..?

ఎవరేమన్నా చెప్పండి.. ప్లానింగ్ అంటే బాలయ్యదే. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. ఇంకోవైపు బసవతారకం హాస్పిటల్ పనులు.. ఇలా అన్నీ మ్యానేజ్ చేస్తుంటారు నటసింహం. అంత బిజీగా ఉంటూ మధ్యలో డిజిటల్‌లోనూ షోస్ చేస్తుంటారు బాలయ్య. ఇక సినిమాల విషయానికి వస్తే తగ్గేదే లే అంటారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య.
ఈ చిత్ర షూటింగ్ జూబ్లిహిల్స్‌లో జరుగుతుంది. తాజాగా బాలయ్య కూడా షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల ఆయన కూతురు పాత్రలో కనిపిస్తున్నారు. తండ్రీ కూతురు సెంటిమెంట్ ప్రధానంగా ఉంటూనే.. ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు అనిల్.
జూన్ 10 బాలయ్య బర్త్ డే రోజు NBK108 ఫస్ట్ లుక్ రానుంది. అదే రోజు NBK109, NBK110 అనౌన్స్‌మెంట్ ఉండొచ్చు. బోయపాటి శ్రీనుతో పక్కా పొలిటికల్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధమవుతున్నారు బాలయ్య. ఇక బలగం ఫేమ్ వేణుతో పాటు.. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు చెప్పిన కథలు కూడా విన్నారు. వీటిలో ఏదో ఓ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యేలా కనిపిస్తుంది. మొత్తానికి ఈ సారి బాలయ్య బర్త్ డేకు ట్రిపుల్ బొనాంజా ఖాయం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




