Tollywood: యంగ్‌ హీరోలకు అగ్ని పరీక్షే.. సెప్టెంబర్‌లో విడుదల కానున్న మీడియం రేంజ్‌ సినిమాలివే

బిగ్ బడ్జెట్‌ ప్యాన్ ఇండియా సినిమాలకు బ్రేక్ రావడంతో మీడియం రేంజ్‌ హీరోలు థియేటర్లకు క్యూ కట్టారు. డూ ఆర్ డై సిచ్యుయేషన్‌లో ఉన్న హీరోలంతా ఒక నెల అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Tollywood: యంగ్‌ హీరోలకు అగ్ని పరీక్షే.. సెప్టెంబర్‌లో విడుదల కానున్న మీడియం రేంజ్‌ సినిమాలివే
Tollywood
Follow us
Basha Shek

|

Updated on: Aug 30, 2022 | 9:46 PM

బిగ్ బడ్జెట్‌ ప్యాన్ ఇండియా సినిమాలకు బ్రేక్ రావడంతో మీడియం రేంజ్‌ హీరోలు థియేటర్లకు క్యూ కట్టారు. డూ ఆర్ డై సిచ్యుయేషన్‌లో ఉన్న హీరోలంతా ఒక నెల అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దీంతో స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా.. సెప్టెంబర్ హీట్ సిల్వర్ స్క్రీన్ మీద కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌. తొలి సినిమా సూపర్ హిట్ అయినా ఆ తరువాత చేసిన కొండ పొలం మాత్రం ఈ యంగ్ హీరోకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. అందుకే ఈ సారి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు వైష్ణవ్‌. ఈ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్‌లోకి అడుగుపెట్టి కమర్షియల్‌ స్టార్‌గానూ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు.

ఎలాగైనా హిట్‌ కొట్టాలనే..

సెప్టెంబర్ రెండో వారంలో బరిలో దిగుతున్న హీరో సత్యదేవ్‌. ఎలాంటి ఫిలిం బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన ఈ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌… స్టార్‌ లీగ్‌లోకి ఎంటర్‌ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే అప్‌ కమింగ్ మూవీ గుర్తుందా శీతాకాలంతో సూపర్ హిట్ అందుకుని నటుడిగానే కాదు.. హీరోగానూ తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యారు. మరో వర్సటైల్‌ స్టార్ సుధీర్‌ బాబు కూడా సెప్టెంబర్ నెలలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత మూడు చిత్రాలు ఫెయిల్ అవ్వటంతో ఈ సారి ఎలాగైన సక్సెస్ సాధించి హీరోగా కమ్‌ బ్యాక్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే తన లక్కీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్‌ నెలలో అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్న మరో యంగ్ హీరో నాగశౌర్య. కెరీర్‌… ఒక హిట్ ఒక ఫ్లాప్ అన్నట్టుగా సాగుతుండటంతో ఈ సారి బిగ్ హిట్‌తో కమర్షియల్‌ స్టార్‌గా సత్తా చాటాలన్న కసితో ఉన్నారు శౌర్య. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన కృష్ణా వ్రిందా విహారి సినిమాతో సూపర్ హిట్ సాధించి కమర్షియల్ స్టార్‌గా తన బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. మరి ఈ హీరోల్లో ఎంత మంది అనుకున్నది సాధిస్తారో చూడాలి.

– సతీష్, టీవీ9 ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..