
థియేటర్లకు ఎన్ని సినిమాలు క్యూలు కట్టినా, అభిమాన హీరోల సెట్స్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఏ హీరోలు, ఏ సెట్లో ఉన్నారు? మనకు ఎంత దగ్గరలో ఉన్నారు? ఎంత దూరంలో ఉన్నారనే డీటైల్స్ ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. రామ్‌చరణ్ కంటిన్యూస్‌గా షూటింగ్ చేస్తున్నారు. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న గేమ్‌చేంజర్ షూటింగ్ ప్రస్తుతం నిజాంపేట్‌లోని సప్తపది ఫంక్షన్‌హాల్‌లో జరుగుతోంది. 2024 సంక్రాంతికి రావడం పక్కా అని స్ట్రాంగ్‌గా గుంటూరు కారం రిలీజ్ గురించి చెప్పేశారు మహేష్‌బాబు. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో త్రివిక్రమ్‌తో జాయిన్ అయ్యారు మహేష్.
ప్రభాస్ హీరోగా మారుతి డైరక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా కోసం కోకాపేట్ లో హౌస్ సెట్ వేశారు. అక్కడే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈగల్. అల్యూమినియం ఫ్యాక్టరీ లో కీ సీన్స్ షూట్ చేస్తున్నారు. సైంధవ్ కోసం బీదర్ పోర్ట్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు శైలేష్ కొలను. వెంకటేష్‌తో పాటు ముఖ్యతారాగణం పాల్గొంటున్నారు.
విజయ్ దేవరకొండ – పరశురాం కాంబినేషన్ మూవీ షూటింగ్ కి కేరాఫ్ ఇప్పుడు నానక్ రామ్ గూడ. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ కోసం శంషాబాద్ లో పోర్ట్ సెట్ వేశారు. అక్కడే మెయిన్ పోర్షన్ షూటింగ్ అవుతోంది. అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప2 సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది.
గోపిచంద్ లేటెస్ట్ మూవీ కోసం ఫారిన్ ప్లాన్ చేశారు. అక్టోబర్‌లో రిలీజ్ కానుంది బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమా భగవంత్ కేసరి. ఈ చిత్రం షూటింగ్ అల్వాల్ లో ప్లాన్ చేశారు. కళ్యాణ్ రామ్ డెవిల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.