AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్ చూద్దామని వచ్చిన అమ్మాయిని ప్రేమ, పెళ్లి అని భయపెట్టిన స్టార్ డైరెక్టర్.. కట్ చేస్తే

స్టార్ డైరెక్టర్ మాత్రం అమ్మాయిని చూడగానే వెళ్లి పెళ్లి చేసుకుందామా అని అడిగేశారట. ఆయన అలా ఆగడడంతో చుట్టుపక్కల వారితో పాటు ఆ అమ్మాయి కుడా షాక్ లో ఉండిపోయిందట. షూటింగ్ చూద్దామని వచ్చిన అమ్మాయిని పెళ్లి చూసుకుందాం అని అడిగారట ఆ దర్శకుడు. ఆయన ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ దర్శకుడు. ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఆయన సినిమాలకోసం వెయిట్ చేస్తుంటారు.

షూటింగ్ చూద్దామని వచ్చిన అమ్మాయిని ప్రేమ, పెళ్లి అని భయపెట్టిన స్టార్ డైరెక్టర్.. కట్ చేస్తే
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jul 13, 2024 | 6:13 PM

Share

సాధారణంగా సినిమా వాళ్ళు చాలా మంది లవ్ మ్యారేజ్‌లు, లేదా పెద్దలు కుదిరించిన పెళ్లి చేసుకున్నారు. తొలి చూపులోనే ప్రేమలో పడటం చాలా అరుదుగా జరిగేవే. ముందు ఫ్రెండ్ షిప్ చేసి.. ఆతర్వాత ప్రేమించుకొని.. ఆతర్వాత పెళ్లి వరకు వెళ్తున్నారు. కానీ ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం అమ్మాయిని చూడగానే వెళ్లి పెళ్లి చేసుకుందామా అని అడిగేశారట. ఆయన అలా ఆగడడంతో చుట్టుపక్కల వారితో పాటు ఆ అమ్మాయి కుడా షాక్ లో ఉండిపోయిందట. షూటింగ్ చూద్దామని వచ్చిన అమ్మాయిని పెళ్లి చూసుకుందాం అని అడిగారట ఆ దర్శకుడు. ఆయన ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ దర్శకుడు. ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఆయన సినిమాలకోసం వెయిట్ చేస్తుంటారు.

ఆ దర్శకుడు ఎవరో తెలుసా.? ఆయన టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్. ఈ స్టార్ దర్శకుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆయన భార్య పేరు లావణ్య. సినిమాలకు దర్శకత్వం వహించక ముందు దూరదర్శన్ లో ఒక సీరియల్ కి దర్శకత్వం వహించారు. అయితే ఒకరోజు హైదరాబాద్ లోని రామంతాపూర్ లో ఆ సీరియల్ షూటింగ్ చేశారట. అప్పుడు ఆ షూటింగ్ చూడటానికి చాలా మంది వచ్చారట. అయితే అందులో ఓ అమ్మాయి పూరిజగన్నాథ్ దృష్టిని ఆకర్షించిందట.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ఆమెను చూసిన తక్షణమే ఆమెపై మనసు పారేసుకున్నాడట. అయితే తన అసిస్టెంట్ ను ఆమెదగ్గరకు పంపించి తన విజిటింగ్ కార్డు ఇచ్చి తనంటే నాకు చాలా ఇష్టం పెళ్లి చేసుకుంటాను.. ఓకే అయితే అందులో ఉన్న నెంబర్ కు కాల్ చేయమని చెప్పాడట. ఆ అసిస్టెంట్ ఆమెకు ఆ కార్డు ఇస్తే తీసుకోకుండా వెనక్కి పంపించిందట. అయినా కూడా మళ్లీ తన అసిస్టెంట్ ను పంపించాడట పూరి. దాంతో ఆమె భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయిందట. ఆతర్వాత వారం రోజులకు తన అసిస్టెంట్ ను తీసుకొని పూరి ఆమె దగ్గరకు వెళ్లి మళ్లీ విజిటింగ్ కార్డు  ఇచ్చి ఫోన్ చేసి చెప్పమన్నారట. ఈసారి చెప్పకపోతే తన పేరెంట్స్ ను తీసుకొచ్చి పెళ్లి గురించి మాట్లాడుతా అని చెప్పాడట. ఆ తర్వాత ఆమె ఆ నెంబర్ కు కాల్ చేసిందట. అయితే అది పూరి అద్దెకు ఉంటున్న ఓనర్ నెంబరట. . ఆతర్వాత ఇద్దరూ బయట కలుసుకొని మాట్లాడుకున్నారట.. ఇలా పూరి జగన్నాథ్ షూటింగ్ చూడటానికి వచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

పూరిజగన్నాథ్ వైఫ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.