Gorantla Rajendra Prasad: సినిమా పరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు.. అనారోగ్యంతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

|

Jul 07, 2022 | 11:37 AM

Gorantla Rajendra Prasad Demise: ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ (Gorantla Rajendraprasad) (86) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Gorantla Rajendra Prasad: సినిమా పరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు.. అనారోగ్యంతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..
Tollywood
Follow us on

Gorantla Rajendra Prasad Demise: సినిమా పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మీనా భర్త విద్యాసాగర్‌ పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో మరణించగా.. నిన్న ఎడిటర్ గౌతంరాజు కన్నుమూశారు. అదేవిధంగా ఆర్.నారాయణ మూర్తి తల్లి, సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి వంటి ప్రముఖులు కూడా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.తాజాగా ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్‌ (Gorantla Rajendraprasad) (86) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు రాజేంద్రప్రసాద్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. మాధవి పిక్చర్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను పలు హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. దొరబాబు, సుపుత్రుడు, కురుక్షేత్రం, ఆటగాడు తదితర హిట్‌ చిత్రాలు ఈ ప్రొడక్షన్ బ్యానర్‌ నుంచి వచ్చినవే.

రాజేంద్ర ప్రసాద్‌ మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గోరంట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..