Mohan Babu: పదేపదే రెచ్చగొట్టకండి.. అందరం కలిసి పనిచేద్దాం.. మోహన్ బాబు వ్యాఖ్యలు

సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రత్యర్ధి వర్గానికి చురకలు అంటించారు. "టీవీలకు ఎక్కడం ఇకనైనా మానేయండి. పదే పదే రెచ్చగొడితే చూస్తూ కూర్చొలేం.  రెచ్చగొట్టడడం మానుకోండి. అందరం కలిసి పనిచేద్దాం. పదే పదే రెచ్చగొడితే గుడిసెలో ఉన్నవాడైనా రెచ్చిపోతాడు.

Mohan Babu: పదేపదే రెచ్చగొట్టకండి.. అందరం కలిసి పనిచేద్దాం.. మోహన్ బాబు వ్యాఖ్యలు
Mohan Babu
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 16, 2021 | 1:42 PM

MAA – Mohan Babu: హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ‘మా’ కొత్త కార్యవర్గం కొంచెం సేపటి క్రితం కొలువు దీరింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించారు. విష్ణు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రత్యర్ధి వర్గానికి చురకలు అంటించారు. “టీవీలకు ఎక్కడం ఇకనైనా మానేయండి. పదే పదే రెచ్చగొడితే చూస్తూ కూర్చొలేం.  రెచ్చగొట్టడడం మానుకోండి. అందరం కలిసి పనిచేద్దాం. పదే పదే రెచ్చగొడితే గుడిసెలో ఉన్నవాడైనా రెచ్చిపోతాడు. ఇది రాజకీయ వేదిక కాదు.. కళాకారుల వేదిక. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. మనమంతా ఒకే తల్లిబిడ్డలం.. మొదటి నుంచి మా స్లోగన్ ఇదే..” అని మోహన్ బాబు అన్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దలను గౌరవించుకునే సంస్కారం పోయిందన్న మోహన్ బాబు.. “పాలిటిక్స్ ఎక్కువైపోయాయి. ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయా? నువ్వుగొప్పా.. నేను గొప్పా.. సినిమాలు ఉన్నాయా.. లేవా అన్నది కాదు. సినిమాలు ఉంటాయి. ప్లాప్స్‌ వస్తాయి. జయాపజయాలు దైవాధీనాలు. సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ ఆర్ కామన్. వీర్రవీగుతాం నేనేంతా అని? కానీ దేవుడు మరుక్షణమే దిమ్మతిరిగేటట్లు కొడతాడు. మేము చాలా మంది అంటూ బెదిరించారు. కానీ ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదు.” అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

ఎవరికీ భయపడకుండా మా ఓటు మాకు సంతమని నా బిడ్డను గెలపించారు అంటూ విష్ణు ఎన్నికపై మోహన్ బాబు వ్యాఖ్యానించారు. మీ రుణం తీర్చుకోలేను. నాకు పగ, రాగద్వేషాలు లేవు.. మీరే నా బిడ్డకు దేవుళ్లు.. ఓటు వేయని వాడి మీద పగవద్దు కక్ష వద్దు. అది సర్వనాశనం చేస్తుంది. అని మోహన్ బాబు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు.

Read also: Sasikala: శశికళ భావోద్వేగం.. జయలలిత సమాధి వద్ద కన్నీరు..