AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie Reviews: పూలచొక్కా.. నొక్కెయ్ ఎంచక్కా – టాలీవుడ్‌లో రివ్యూ మాఫియా..!

ఏం గురూ సినిమా ఎట్లుంది. అబ్బే రివ్యూ అంత బాగోలేదురా.. అందుకే వెళ్లడంలే.. అన్న డిస్కషన్ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది సినిమా లవర్స్ మధ్య . అంటే సినిమా బాగుందో లేదో డిసైడ్ చేసేది ప్రేక్షకులు కాదు..రివ్యూలేనా. అందుకే రివ్యూ మాఫియా రెచ్చిపోతుందా..? అంటే అవుననే ఆందోళన వ్యక్తం చేస్తోంది టాలీవుడ్. డబ్బులిస్తే సినిమా దరిద్రంగా ఉన్నా 5 చుక్కల రేటింగ్. ఇవ్వకుంటే మాత్రం నిర్మాతకు చుక్కలే అన్నట్టుగా ఉంది సిట్చువేషన్. లేటెస్ట్‌గా రివ్యూ మాఫియాపై ఓ కేసు కూడా ఫైల్ అయింది. ఇంతకూ రివ్యూ మాఫియా నిర్మాతలను ఎలా టార్గెట్ చేస్తోంది.?

Movie Reviews: పూలచొక్కా.. నొక్కెయ్ ఎంచక్కా - టాలీవుడ్‌లో రివ్యూ మాఫియా..!
Poolachokka Naveen
Ram Naramaneni
|

Updated on: Jul 19, 2025 | 8:23 PM

Share

కృష్ణా నగరే మామ..కృష్ణానగరే. లైఫంతా సినిమా మామ..సినిమాయే లైఫుర మామా అంటూ వేలమంది సినీ ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి ఇండస్ట్రీకి పట్టిన చీడే రివ్యూ మాఫియా అంటున్నారు కొందరు నిర్మాతలు. సినిమాలు చూడకుండానే రివ్యూలివ్వడం, రేటింగ్ పేరుతో సినిమా వసూళ్లపై ప్రభావం చూపడం..ఈమధ్య ఎక్కువైందన్న ఆరోపణలు టాలీవుడ్‌ నుంచి వినిపిస్తున్నాయి.

తెలుగు సినిమాను రివ్యూ మాఫియా శాసిస్తోందా..అంటే అవుననే సమాధానం వస్తోంది కొందరు నిర్మాతల నుంచి. అంతేకాదు మంచి రేటింగ్ ఇవ్వాలంటే డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లేటెస్ట్‌గా‘వర్జిన్ బాయ్స్ నిర్మాత..రివ్యూలిచ్చే యూట్యూబర్ పూలచొక్కా నవీన్‌పై కేసు పెట్టాడు. పాజిటివ్ రివ్యూ ఇచ్చేందుకు నవీన్ తనను డబ్బులు డిమాండ్ డబ్బులు చేశాడంటూ నిర్మాత కేసు ఫైల్ చేశాడు.

వర్జిన్ బాయ్స్ సినిమా ప్రమోషన్ కోసం నవీన్‌తో చిత్ర యూనిట్ ఓ డీల్ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం సినిమా రిలీజ్‌కు ముందు సినిమాను తన యూట్యూబ్ చానల్ ద్వారా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రమోషన్ సమయంలో నవీన్ మొదట మంచి రివ్యూలు ఇచ్చినప్పటికీ, తర్వాత చిత్రానికి నష్టం కలిగించేలా నెగెటివ్ రివ్యూలు ఇచ్చాడన్నది ప్రొడ్యూసర్ వెర్షన్. పూలచొక్కా రివ్యూలు తన సినిమాపై ప్రభావం చూపిందని, ఇది తమ మధ్య ఒప్పందానికి పూర్తి విరుద్ధమంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు నిర్మాత రాజా దరపునేని . దీంతో ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నవీన్‌ను విచారణకు పిలిచారు.

సినిమా విడుదలకు ముందు,.తర్వాత పాజిటివ్ రివ్యూలు ఇవ్వడానికి కొందరు యూట్యూబర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న టాక్ సినీ ఇండస్ట్రీలో ఉంది. ఒకవేళ నిర్మాతలు డబ్బులు చెల్లించకపోతే, నెగెటివ్ రివ్యూలతో వసూళ్లపై ప్రభావం చూపేలా నెగిటివ్ ప్రచారం చేసి సినిమాను దెబ్బకొడతారని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్జిన్ బాయ్స్ జూలై 11న రిలీజ్ అయింది. ఈసినిమాకు పూలచొక్కా నవీన్ నెగిటివ్ రివ్యూ ఇవ్వడమే కాదు , హీరోయిన్లపై బాడీ షేమింగ్‌ కూడా చేశాడంటోంది చిత్ర బృందం. అయితే తాను జెన్యూన్ రివ్యూనే ఇచ్చానని..తాను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలుంటే చూపాలంటున్నాడు నవీన్. సినిమా విషయంలోనే మాట్లాడాను తప్ప..హీరోయిన్స్‌ను కించపరిచేలా మాట్లాడలేదన్నది నవీన్ వెర్షన్.

రివ్యూ మాఫియా సమస్య తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు, వివాదాలు జరిగాయి. అయినా రివ్యూ మాఫియా ఆగడాలకు చెక్ పడడంలేదు. కొంతమంది యూట్యూబర్స్ చేసే ప్రాపగండ…సినిమాకు గుదిబండగా మారుతోంది. సినిమా బాగున్నా..కొంతమంది ఇచ్చే నెగిటివ్ రేటిగ్స్ వల్ల సినిమా చూడాలనుకున్నవారిపై ప్రభావం చూపుతోందంటున్నారు నిర్మాతలు. రివ్యూలే మౌత్‌టాక్‌గా మారి సినిమాకు నష్టాలకు కారణమవుతుందని ప్రొడ్యూసర్స్ వాపోతున్నారు. వీటికి ఎంత త్వరగా చెక్ పడితే అంత మంచిదంటున్నారు నిర్మాతలు. ఒరకంగా సింగిల్ థియేటర్ల మనుగడపైనా ఇలాంటి రివ్యూల ప్రభావం కూడా ఉందన్న చర్చ కూడా జరుగుతోంది ఇండస్ట్రీల. మరి వీటికి చెక్ పెట్టేందుకు ఫిలించాంబర్ చర్యలు తీసుకుంటుందా..లేదా అన్నది చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..