AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వెండితెరపై విరామం… క్లైమాక్స్‌పై ఉత్కంఠ!

అన్నపూర్ణ స్టూడియోలో 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' షూటింగ్‌ను అడ్డుకోవడం ఏంటని టాలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతోందట. బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ అయిందది. ఆ సినిమా యూనిట్‌తో పెద్ద వాగ్వాదమే జరిగిందనేది ఓ టాక్. ఒక్క ఆ సినిమాకే కాదు... తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద యుద్ధమే జరుగుతోందిప్పుడు. ఏమంటే... సినీ కార్మికులకు వేతనాలు పెంచండి, అప్పుడే వాళ్లని పనిలోకి పంపిస్తామని యూనియన్లు చెబుతున్నాయి. అదేంటి.. ఇప్పుడిస్తున్న వేతనాలే ఎక్కువ కదా, ఇంకా పెంచితే ఆరిపోమా అని నిర్మాతలు వాదిస్తున్నారు. పెంచితేనే కార్మికులు షూటింగ్‌కు వస్తారని ఫెడరేషన్.. పెంచే ప్రసక్తే లేదు అని ఫిల్మ్‌ ఛాంబర్. ఒకవిధంగా కార్మిక సంఘాలకు, నిర్మాతల మండలికి మధ్య ఊహించిన దానికి మించి యుద్ధం నడుస్తోంది. అసలు యూనియన్ల నుంచే ఎందుకు కార్మికులను తీసుకోవాలి... దేశంలో మాఇష్టం వచ్చిన రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకుంటామనేది నిర్మాతల అల్టిమేటం. అలా బయటి వాళ్లను తెచ్చుకుంటే ఊరుకునేది లేదని యూనియన్ల వార్నింగ్‌. సో, చిన్న గొడవేం కాదిది? చూస్తుంటే ఇప్పట్లో పుల్‌స్టాప్‌ పడేలా కనిపించడంలేదు కూడా. మరి.. సినీ పెద్దలు చూపుతున్న పరిష్కారం ఏంటి?

Tollywood: వెండితెరపై విరామం... క్లైమాక్స్‌పై ఉత్కంఠ!
Tollywood Shut
Ram Naramaneni
|

Updated on: Aug 05, 2025 | 9:45 PM

Share

సినిమాల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌లో భాగంగా ఫైటింగ్‌ జరుగుతుంటుంది. బట్.. షూటింగ్‌లను అడ్డుకునేలా ఫైటింగ్‌ జరుగుతోందిప్పుడు. రీల్‌లో ఉండాల్సిన సీన్‌ రియల్‌గానే కనిపిస్తోంది. ఇందాక చెప్పుకున్నట్టు కార్మిక సంఘాలు, నిర్మాతల మండలికి మధ్య గొడవ చాలా సీరియస్‌గా జరుగుతోంది. ‘ఎందుకని తాము యూనియన్ల నుంచే సినీ కార్మికులను తెచ్చుకోవాలి’ అనేది ప్రొడ్యూసర్ల సూటి ప్రశ్న. అందుకే, ముంబై, చెన్నై కార్మికులతో షూటింగ్ పూర్తి చేస్తున్నాయి కొన్ని బ్యానర్లు. మరి ఆ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నట్టే అన్నింటినీ అడ్డుకుంటాయా యూనియన్లు? నిర్మాతలు బయటి వాళ్లను తెచ్చుకుని పని నడిపిస్తే ఇక్కడోళ్ల పరిస్థితేంటి? కార్మికులు కోరుతున్న వేతనాల పెంపులో న్యాయం కనిపించడం లేదా?  తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్ చెబుతున్న వర్షన్‌లో.. టాలీవుడ్‌లో ఓ ఒప్పందం ఉంది. ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతనాలు పెంచడం సంప్రదాయం అనేది ఫెడరేషన్ చేస్తున్న వాదన. కరోనా ఎఫెక్ట్ కావొచ్చు, మరేదైనా కారణాలు కావొచ్చు… నాలుగేళ్లుగా సినీ కార్మికులు వేతనాల పెంపు అడగట్లేదని చెబుతోంది ఫెడరేషన్. దీనికోసం ఎన్నోసార్లు ఫిల్మ్‌ ఛాంబర్‌ మెట్లు ఎక్కాం, నిర్మాతలతో మాట్లాడాం అంటోంది కూడా. ఎన్నిసార్లు అడిగినా వేతనాలు పెంచడం లేదు కాబట్టే సమ్మెకు దిగాం అనేది ఫెడరేషన్‌ చెబుతున్న సమాధానం. ఎవరైతే వేతనాలను 30 శాతం పెంచుతారో వారి సినిమాలకే పనిచేస్తామని నిర్మాతల మండలికి ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఒక అల్టిమేటం కూడా ఇచ్చింది. అంతేకాదు.. ఆ వేతనాలను కూడా రోజువారీగా చెల్లించాలి తప్ప పెండింగ్‌ పెట్టకూడదనేది...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..