Posani Krishna Murali: ‘మీరు మాత్రం క్షమార్హులు కాదు సార్’.. పోసాని కృష్ణ మురళిపై టాలీవుడ్ నిర్మాత సంచలన ట్వీట్

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి రాజకీయాలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జీవితంలో రాజకీయాలు మాట్లాడనని, తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తానని ప్రకటించారు. అయితే పోసాని నిర్ణయంపై టాలీవుడ్ యంగ్ నిర్మాత ఒకరు సంచలన ట్వీట్ చేశారు.

Posani Krishna Murali: మీరు మాత్రం క్షమార్హులు కాదు సార్.. పోసాని కృష్ణ మురళిపై టాలీవుడ్ నిర్మాత సంచలన ట్వీట్
Posani Krishna Murali

Updated on: Nov 22, 2024 | 2:53 PM

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ కీలక నేత పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని ప్రకటించారు. ఏ పార్టీని పొగడనని, ఏ పార్టీని తిట్టనని ప్రెస్ మీట్ మరీ పెట్టి చెప్పుకొచ్చారు. రాజకీయాలు అంటూ తన ఫ్యామిలీకి తగిన సమయం ఇవ్వలేకపోతున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. అయితే పోసాని నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ కారంణంగా పోసానిపై చాలా చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇంతలోనే రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారు పోసాని. ఈ నిర్ణయంపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ పెట్టారు.

గతంలో పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి పోసాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసిన ఎస్కేఎన్.. ‘సార్, ఇప్పుడు అందరికి అన్ని గుర్తొస్తాయి కానీ విరమిస్తున్నా అని నటించే ముందు కనీసం మీరు మా అభిమాన నాయకుడి గురించి ముఖ్యంగా ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేని లేకి వాఖ్యలకి చింతిస్తున్నా లేదా క్షమించండి అని అడిగి ఉంటె కనీసం ఈ మాటలు నమ్మాలనిపించేది. ఏదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు మీరు. ఎన్నో సార్లు ఎంతో నీచంగా మాట్లాడారు. అభిమానుల మనసు చాలా అంటే చాలా బాధ పెట్టారు. ఛీ ఇవేం మాటలు అని చెవులు మూసుకొనేలా చేశారు. మీ ఒకళ్ళదే కాదు సార్ అందరివీ కుటుంబాలే. ఎవరి పిల్లలు ఐనా పిల్లలే. రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ వ్యక్తిగతం గా దిగజారుడు పదాలు కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారు మాత్రం క్షమార్హులు కాదు’ అని తెలుగులో రాసుకొచ్చారు ఎస్కేఎన్. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

Producer SKN Tweet

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి