ఒకప్పుడు చిరంజీవి భార్య దగ్గర 5వేలు అప్పు చేశాడు.. ఇప్పుడేమో టాలీవుడ్‌ స్టార్.. కోట్లలో ఆస్తులు.. ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. ఎన్నో డక్కా ముక్కీలు తిన్నాకా గానీ చాలా మంది ఈ పరిశ్రమలో స్టార్స్ గా ఎదగలేదు. అలా కేవలం రూ.45తో సినిమా కెరీర్ ప్రారంభించిన ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిపోయాడు. కొన్ని కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యాడు.

ఒకప్పుడు చిరంజీవి భార్య దగ్గర 5వేలు అప్పు చేశాడు.. ఇప్పుడేమో టాలీవుడ్‌ స్టార్.. కోట్లలో ఆస్తులు.. ఎవరంటే?
Chiranjeevi Family

Updated on: Oct 08, 2025 | 9:37 PM

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖమ్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దివంగత నటుడు అల్లు రామలింగయ్య కూతురు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు సోదరైన ఆమె చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగేందుకు అన్ని రకాలుగా అండగా నిలిచింది. చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉంటే తనే ఇంటి బాధ్యతలను తీసుకుంది. సురేఖ ని పెళ్లి చేసుకున్న తర్వాత తనకు అన్ని రకాలుగా కలిసొచ్చిందని చిరంజీవే చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో గతంలో సురేఖ చేతుల మీదుగా డబ్బులు తీసుకున్న చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సమయంలో అతనికి ఖర్చుల కోసం పాకెట్ మనీగా చాలా సార్లు డబ్బు ఇచ్చిందట సురేఖ. అలా పవన్ కల్యాణ్ లాగానే సురేఖమ్మ చేతుల మీదుగా 5 వేలు తీసుకున్న ఒకతను ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా వెలుగొందుతున్నాడు. అతనే ప్రముఖ నిర్మాత బన్నీ వాసు. మెగా,అల్లు ఫ్యామిలీలకు ఎంతో సన్నిహితుడైన బన్నీ వాసు ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నాడు.

దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య సినిమాకు కో ఆర్డినేటర్ గా పని చేశాడు బన్నీవాసు. సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు అల్లు అర్జున్, దిల్ రాజుతో చాలా జోవియల్ గా ‘పశ్చిమ గోదావరి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మనవాళ్లకే ఇవ్వొచ్చు కదా?’ అని అడిగాడట. వెంటనే దిల్ రాజు, బన్నీ వాసుని పిలిచి ఓ డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడమన్నాడు. కానీ అతడు భారీ రేటు చెప్పాడట. దీంతో దిల్ రాజు ‘ అతన్ని వదిలెయ్. మొత్తం బిజినెస్ నువ్వే హ్యాండిల్ చెయ్’ అని బన్నీ వాసుకు బంఫర్ ఆఫర్ ఇచ్చాడుట. అయితే ఆ సమయంలో బన్నీ వాసు దగ్గర సరిపడ డబ్బు లేదట. అన్నీ పాకెట్స్ వెతికితే దొరికింది కేవలం రూ.45 మాత్రమే దొరికాయట. దీంతో 45 రూపాయలను దిల్ రాజు చేతిలో పెట్టి మిగతా డబ్బు తర్వాత ఇస్తానని మాట ఇచ్చాడట బన్నీ వాస్.

ఇవి కూడా చదవండి

ఆర్య సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా మిగిలిన డబ్బు కోసం మెగా ఫ్యామిలీని కలిశాడట బన్నీ వాసు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ దగ్గర రూ.5,000 అప్పుగా తీసుకుని, దిల్ రాజుకు పంపించాడట. ఆ సమయంలో అల్లు అరవింద్ భార్య కూడా ఈ నిర్మాతకు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసిందట. ఈ విషయాన్ని ఇటీవలే బయట పెట్టాడు బన్నీవాసు. అయితే ఇప్పటికీ ఆ డబ్బు తిరిగివ్వలేదని నవ్వుతూ చెప్పాడీ టాలీవుడ్ ప్రొడ్యూసర్.

బన్నీతో బన్నీ వాసు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.