Goutham Raju Demise: సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్‌రాజు (Goutham Raju) (68) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సినిమా ఇండస్ట్రీలో 800 కు పైగా చిత్రాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన ఘనత ఆయన సొంతం. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా పనిచేశారు. ఖైదీ నెంబర్ 150, గబ్బర్ సింగ్, కాటమరాయుడు, కిక్, రేసుగుర్రం, గోపాలగోపాల, అదుర్స్, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్, మిరపకాయ్, కృష్ట, డాన్ శీను, సౌఖ్యం, డిక్టేటర్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నంది పురస్కారం అందుకున్నారు. ఇలాంటి అవార్డులు ఆయన ఖాతాలో చాలానే ఉన్నాయి. 68 ఏళ్ల వయసున్న ఆయన మరణానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌రాజు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..