Tollywood Movie Workers: టాలీవుడ్‌లో మోగిన సమ్మె సైరన్.. క్లాప్‌కి బ్రేక్..

సినీ కార్మిక సమాఖ్య సమ్మెతో ప్రస్తుతం సెట్‌లో ఉన్న సినిమాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఇందులో ముఖ్యంగా 8 సినిమాలపై ఎఫెక్ట్ పడనుంది.

Tollywood Movie Workers: టాలీవుడ్‌లో మోగిన సమ్మె సైరన్.. క్లాప్‌కి బ్రేక్..
Tollywood News

Updated on: Jun 22, 2022 | 10:32 AM

టాలీవుడ్‌లో సమ్మె సైరన్‌తో క్లాప్‌కి బ్రేక్‌ పడింది. 24 క్రాఫ్ట్‌లకి సంబంధించిన కార్మికులంతా స్ట్రైక్‌లోకి వెళ్లిపోవడంతో షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. ప్రధానంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌‌తో సినీ కార్మిక సంఘం సమ్మెకు దిగింది. మరోవైపు నోటీస్‌ ఇవ్వకుండా సమ్మెకి వెళ్లడంపై ఫిల్మ్ ఛాంబర్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఫిల్మ్‌ ఛాంబర్‌ – నిర్మాతల మండలి కాసేపట్లో సమావేశం కాబోతుండడంతో సీన్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో సమ్మె కాస్త సినీ కార్మిక సమాఖ్య వర్సెస్‌ ఫిల్మ్‌ చాంబర్‌గా మారిపోయింది.

ఎవరి వాదన ఎలా ఉందో ఓ సారి చూద్దాం..

  1. నోటీస్ ఇవ్వకుండా సమ్మెలోకి ఎలా వెళ్తారని ఫిల్మ్ ఛాంబర్ ప్రశ్నిస్తుంటే.. మరోవైపు సినీ కార్మిక సమాఖ్య 15 రోజుల గడువుతో ఇప్పటికే నోటీస్ ఇచ్చామంటోంది.
  2. వేతనాలు పెంచాలన్న డిమాండ్‌కి ఎలాంటి అభ్యంతరాలేవంటుంది ఫిల్మ్ చాంబర్‌. అలాంటప్పుడు మూడేళ్లుగా ఎందుకు వేతనాలు పెంచలేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
  3. ఇవి కూడా చదవండి
  4. సెట్‌లో సినిమాలకి బ్రేక్ పడలేదని.. ప్రొడ్యూసర్లు యధావిధిగా షూటింగ్‌లకి హజరవుతున్నారని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు చెబుతున్నాడు. మరోవైపు వేతనాలు పెంచేదాకా షూటింగ్‌లకి హాజరుకాబోమంటున్నారు కార్మికులు.
  5. కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదని ఫిల్మ్ చాంబర్‌ మాట. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ఇప్పటికైనా పెంచాలంటున్నారు కార్మికులు. అప్పటిదాకా షూటింగ్‌లకి హాజరుకాబోమంటున్నారు.
  6. ఫైటర్ షూటింగ్ ఆగిపోవడంతో ఫిర్యాదులు వచ్చాయని.. ఆ కారణంగా రెండు కోట్ల నష్టం వచ్చిందని ఫిల్మ్ చాంబర్ గుర్తు చేస్తోంది. ఆరు నెలలుగా కార్మిక సమాఖ్య సంప్రదింపులు జరుపుతుందని అయినా స్పందన లేకపోవడంతోనే సమ్మెకి వెళ్లామంటున్నారు కార్మికులు.
  7. కార్మికులు సమ్మెకి వెళ్లకుండా సంప్రదింపులు జరపాలంటోంది ఫిల్మ్ చాంబర్‌. కానీ కార్మికులు మాత్రం సమ్మెకి సై అంటున్నారు. వేతనాలు పెంచేదాకా తగ్గేదేలే అని తెగేసి చెబుతున్నారు.
  8. ఈ సందర్భంగా సమ్మెపై ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ, కార్మికులు మాత్రం తాము గొంతెమ్మ కోర్కేలు కోరడం లేదని.. కొంతలో కొంత వేతనం పెంచమని మాత్రమే అడుగుతున్నామని విఙ్ఞప్తి చేస్తున్నారు.

సినీ కార్మిక సమాఖ్య సమ్మెతో ప్రస్తుతం సెట్‌లో ఉన్న సినిమాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఆ సినిమాలేంటో ఇఫ్పుడు చూద్దాం..

  1. హైదరాబాద్‌లో ‘భోళా శంకర్’ షూటింగ్‌
  2. కోకాపేట్‌లో సల్మాన్‌ ఖాన్ మూవీ ‘కభీ ఈద్‌ కభీ దివాలి’
  3. అన్నపూర్ణ స్టూడియోలో విజయ్‌ దేవరకొండ-సమంత మూవీ
  4. ముంబయ్‌లో పూరి జగన్నాథ్‌ మూవీ ‘జనగణమన’
  5. అల్యూమినియం ఫ్యాక్టరీలో రవితేజ సినిమా ‘రావణాసుర’
  6. సాయి ధరమ్‌ తేజ్‌-కార్తీక్‌ దండు డైరెక్షన్‌లో మూవీ
  7. రామోజీ ఫిలిం సిటీలో హీరో ధనుష్‌ మూవీ షూటింగ్‌
  8. అల్యూమినియం ఫ్యాక్టరీలో అల్లరి నరేష్‌ ‘మారేడుమిల్లీ ప్రజానీకం’