Chiranjeevi: క్యాన్సర్ గురించి మెగాస్టార్ కామెంట్స్.. కన్‌ఫ్యూజన్‌పై క్లారిటీ

తాను క్యాన్సర్‌ బారినపడినట్లు వచ్చిన వార్తలపై అగ్రకథానాయకుడు మెగాస్టార్​ చిరంజీవి స్పందించారు. తనకు ఎటువంటి ప్రాబ్లమ్​ లేదని ట్విట్టర్​ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

Chiranjeevi: క్యాన్సర్ గురించి మెగాస్టార్ కామెంట్స్.. కన్‌ఫ్యూజన్‌పై క్లారిటీ
Megastar Chiranjeevi
Follow us

|

Updated on: Jun 03, 2023 | 7:38 PM

తాను అలర్ట్​గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా non – cancerous polypsను డిటెక్ట్ చేసి.. వాటిని డాక్టర్లు తీసేశారు చిరంజీవి తెలిపారు. ఏఐజీ ఆస్పత్రిలో ఒక వయస్సు దాటిన తర్వాత.. కొలనోస్కోపీ చేయించుకున్నట్లు చిరు చెప్పారు. ఆ రిపోర్ట్‌లో తన శరీరంలోని పాలిప్స్‌ను డాక్టర్లు గుర్తించారని.. ఆ పాలిప్స్‌ను వదిలేస్తే మెలాగ్లిన్ మారే చాన్స్ ఉందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు. 80 నుంచి 90 శాతం పాలిప్స్ మెలాగ్లిన్‌గా మారే అవకాశం ఉంటాయని డాక్టర్లు చెప్పినట్లు మెగాస్టార్ వివరించారు. ముందుగా గుర్తించిన కారణంగా డాక్టర్లు పాలిప్స్ రిమూవ్ చేశారని చెప్పారు. ఈ అవగాహన తనకు లేకపోయి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో భయమేసిందన్నారు. తనకు అవగాహన ఉండటంతోనే ముందుకు వెళ్లి కొలనోస్కోపీ చేయించుకున్నానని వివరించారు.

ఈ విషయం చెప్పడానికి తాను భయపడటం లేదని వెల్లడించారు. ఓ ప్రవేట్ ఆస్పత్రి క్యాన్సర్ సెంటర్ ప్రారంభించేందుకు వెళ్లిన చిరు.. ఈ విషయాన్ని రివీల్ చేశారు.  క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే పెద్ద జబ్బు కాదని ఆయన పేర్కొన్నారు. భగవంతుడు ఇస్తే ఏం చేయలేమని.. కానీ స్మోకింగ్ చేయడం, గుట్కాలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని.. వాటికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వయస్సుతో పాటు కొన్ని సమస్యలు ఉంటాయని.. మంచి డైట్ పాటించి.. వ్యాయామాలు చేసి వాటి నుంచి బయట పడొచ్చని చెప్పారు.

అయితే కేవలం టిష్యులు ఉన్నాయని తాను చెబితే.. క్యాన్సర్ వచ్చినట్లు కొందరు రాయడం పట్ల చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని అర్థం చేసుకోకుండా రాయడం వల్ల  అనేక మందిని  భయభ్రాంతుల్ని  చేసి  బాధ పెట్టిన వారవుతారని పేర్కొన్నారు.