Celebrities meet CM Revanth Reddy: సర్కారు వారి మాట..! సినీ పెద్దలు ఏమన్నారు.. సీఎం ఏం చెప్పారంటే

| Edited By: TV9 Telugu

Dec 26, 2024 | 5:36 PM

Tollywood Film Industry Celebrities Meet CM Revanth Reddy Highlights: సీఎం రేవంత్‌తో టాలీవుడ్‌ పెద్దలు భేటీ అయ్యారు. సినీ ప్రముఖులతో భేటీకి మంత్రులు, కీలక అధికారులు హాజరయ్యారు. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను మీటింగ్‌కు పిలిచారు సీఎం రేవంత్. సంధ్య థియేటర్ ఘటనపై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం. అలాగే టికెట్ రేట్లు గురించి కూడా చర్చ జరిగిందని తెలుస్తుంది.

Celebrities meet CM Revanth Reddy: సర్కారు వారి మాట..! సినీ పెద్దలు ఏమన్నారు.. సీఎం ఏం చెప్పారంటే
Cm.revanth Reddy

సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ అయ్యారు. నేటి ఉదయం సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుకున్నారు. దిల్‌ రాజు నేతృత్వంలో పలువురు ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు.  దిల్‌రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్‌, త్రివిక్రమ్‌, హరీష్ శంకర్, సి.కళ్యాణ్ కమాండ్ కంట్రోల్‌ ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఇవాళ్టి భేటీలో సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై చర్చజరిగింది.

సీఎం దగ్గర సినీ ఇండస్ట్రీ ఉంచిన ప్రతిపాదనలు ఇవే ,  బెనిఫిట్‌ షోలు, టికెట్ ధరల పెంపు.  ఇతర రాయితీలు, సౌకర్యాలపై ప్రతిపాదనలు. కాగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వ వైఖరి మారింది. రాయితీలు ఇచ్చేందుకు రెడీ అంటూనే కండిషన్లు పెట్టారు సీఎం రేవంత్. తాను సీఎంగా ఉన్నంతకాలం ప్రత్యేక సౌకర్యాలు కుదరవని తేల్చి చెప్పారు సీఎం. మీటింగ్‌లో ఇండస్ట్రీ పెద్దలు తమ సమస్యలను అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీఎం దానికి సానుకూలంగా స్పందించడంతో పాటు పలు సూచనలు కూడా చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Dec 2024 01:09 PM (IST)

    తెలుగు సినిమాపై సీఎం తన విజన్ ఏంటో చెప్పారు: దిల్ రాజు

    తెలుగు సినిమాపై సీఎం తన విజన్ ఏంటో చెప్పారు అని దిల్ రాజు అన్నారు. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లాలని సీఎం సూచించారు.

  • 26 Dec 2024 12:14 PM (IST)

    ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ అనేవి రైలు పట్టాలాంటివే: రేవంత్ రెడ్డి

    మా హయంలో ఇండస్ట్రీ కోసం 8 జీవోలను ప్రతిపాదించాం, స్పెషల్ ఇన్సెంటివ్స్ అందించామన్నారు రేవంత్ రెడ్డి. మాకు ఐటీ, ఫార్మా రంగాలు ఎంత ముఖ్యమో.. సినిమా ఇండస్ట్రీ కూడా అంతే ముఖ్యం అన్నారు సీఎం. ప్రభుత్వం, సినిమా అనేవి రైలు పట్టాలాంటివే. ఇప్పటిదాకా మాట్లాడుకోని అంశాల పై ఉన్న అభిప్రాయాలను మార్చుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడిందని రేవంత్ అన్నారు.

  • 26 Dec 2024 11:49 AM (IST)

    మాది ప్రజా ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి

    మాది ప్రజా ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఏడాది కాలంగా అంతా మా పరిపాలనను గమనిస్తున్నారు. సినీ ఇండస్ట్రీ కూడా కలిసి రావాలి. సినిమా పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దు. తెలంగాణ రైజింగ్ లా బిజినెస్ మోడల్ ని తీసుకెళ్దాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి

  • 26 Dec 2024 11:43 AM (IST)

    సినిమా సక్సెస్ రేటు 1 శాతం మాత్రమే ఉంది: ప్రశాంత్ వర్మ

    200ల సినిమాలు తీస్తే అందులో 100 సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయని ప్రశాంత్ వర్మ అన్నారు. అందులో ఒకటో, రెండో హిట్ అవుతున్నాయని.. సినిమా సక్సెస్ రేటు 1 శాతం మాత్రమే ఉందని ప్రశాంత్ వర్మ అన్నారు.

  • 26 Dec 2024 11:40 AM (IST)

    సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేదుకు ప్రయత్నిస్తాం: అల్లు అరవింద్

    ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అరవింద్. సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేదుకు ప్రయత్నిస్తాం అన్నారు అరవింద్. హైదరాబాద్ షూటింగ్ లకు బెస్ట్ స్పాట్ ని ముంబై వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు అని అల్లు అరవింద్ అన్నారు. ముంబైతో పోల్చితే ట్రాఫిక్ తక్కువగా ఉండటం మనకు ప్లస్ పాయింట్. తెలుగు నిర్మాతలకు ఈ రోజు శుభదినం అని అల్లు అరవింద్ అన్నారు.

  • 26 Dec 2024 11:32 AM (IST)

    ప్రజల భద్రత మాకు ముఖ్యం: డీజీపీ జితేందర్

    ప్రజల భద్రత మాకు ముఖ్యం అని డీజీపీ అన్నారు. షోలు నిర్వహించేటప్పుడు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని డీజీపీ జితేందర్  జితేంద్ర అన్నారు. అలాగే అనుమతులను ముందుగా తీసుకోవాలని అలాగే షరతులు కూడా ఉంటాయి అని అన్నారు డీజీపీ. బౌన్సర్ల ప్రవర్తన పై ఆందోళన ఉంది. బౌన్సర్లు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు డీజీపీ జితేందర్

  • 26 Dec 2024 11:28 AM (IST)

    ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవన్న సీఎం

    ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవన్నారు సీఎం రేవంత్. ఇదేవిషయాన్ని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్‌. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు రేవంత్‌

  • 26 Dec 2024 11:27 AM (IST)

    ప్రభుత్వం మమ్మల్ని బాగా చూసుకుంటోంది: రాఘవేంద్రరావు

    అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని రాఘవేంద్రరావు అన్నారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్‌ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా.. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయని రాఘవేంద్రరావు అన్నారు. అలాగే గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో చేశారు.. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం అన్నారు రాఘవేంద్రరావు

  • 26 Dec 2024 11:22 AM (IST)

    హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలన్నదే మా కోరిక: నాగార్జున

    యూనివర్సల్ లెవల్ లో స్టూడియో సెటప్ ఉండాలని నాగార్జున అన్నారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే సినిమా పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని నాగార్జున అన్నారు. అలాగే హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలన్నదే మా కోరిక అని నాగ్ అన్నారు.

  • 26 Dec 2024 11:20 AM (IST)

    హైదరాబాద్ ను నెక్స్ట్ లీలావ్ లో ఉండాలి : శ్యామ్ ప్రసాద్ రెడ్డి.

    చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నా.. హైదరాబాద్ ను నెక్స్ట్ లీలావ్ లో ఉండాలి : శ్యామ్ ప్రసాద్ రెడ్డి.

  • 26 Dec 2024 11:18 AM (IST)

    రిలీజ్ ల్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్స్ కీలకంగా మారింది: మురళి మోహన్

    సినిమా రిలీజ్ ల్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్స్ కీలకంగా మారిందని మురళీ మోహన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండటం వల్ల ప్రమోషన్స్ విస్తృతంగా చేస్తున్నాం. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని మురళీ మోహన్ అన్నారు.

  • 26 Dec 2024 11:09 AM (IST)

    మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే సర్కార్ సీరియస్

    ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం. సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే..తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందన్న సీఎం రేవంత్‌

  • 26 Dec 2024 11:08 AM (IST)

    వాళ్ళ వల్లే వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చింది: త్రివిక్రమ్

    మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని త్రివిక్రమ్‌ అన్నారు.

  • 26 Dec 2024 11:08 AM (IST)

    ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్న దగ్గుబాటి సురేష్‌బాబు

    ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నరు దగ్గుబాటి సురేష్‌బాబు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్.. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిందని  సురేష్‌బాబు అన్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు.. హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలని సురేష్‌బాబు అన్నారు.

  • 26 Dec 2024 11:07 AM (IST)

    టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి

    టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి.  ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని సీఎం అన్నారు.

  • 26 Dec 2024 11:06 AM (IST)

    ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్ బిలిటీతో ఉండాలి.

    తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్ బిలిటీతో ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్ లో ఇండస్ట్రీ చొరవ చూపాలి అని సీఎం అన్నారు.

  • 26 Dec 2024 11:05 AM (IST)

    శాంత్రి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం.

    శాంత్రి భద్రతల విషయంలో రాజీ లేదన్నారు సీఎం. బౌన్సర్ల విషయంలో సీరియస్ గా వ్యవహరించబోతుంది. అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రెటీలదే అన్న ప్రభుత్వం. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉన్నామని భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి.

  • 26 Dec 2024 11:02 AM (IST)

    సంధ్య థియేటర్ ఘటన పై ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.

    సంధ్య థియేటర్ ఘటన పై ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఒక మహిళా ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం సీరియస్ అయ్యిందని తెలిపారు.

  • 26 Dec 2024 11:00 AM (IST)

    సీఎంతో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు..

    ముందుగా సంధ్య థియేటర్ ఘటన పై సీఎం మాట్లాడారని తెలుస్తుంది. అలాగే టికెట్స్ రేట్స్ గురించి కూడా మాట్లాడారని తెలుస్తుంది.

  • 26 Dec 2024 10:44 AM (IST)

    టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు

    యాంటీ డ్రగ్స్‌ క్యాంపెయిన్‌కు సహకరించాలంటున్న ప్రభుత్వం. ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలంటున్న సర్కార్‌. టికెట్ల ధరలపై విధించే సెస్‌ను.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి వినియోగించాలన్న ప్రభుత్వం. ఇకపై ర్యాలీలు నిషేధిస్తామన్న ప్రభుత్వం. అన్ని విషయాలను పరిశ్రమ ప్రముఖులకు వివరించనున్న సీఎం. కులగణన సర్వేపై ప్రచారానికి ముందుకు రావాలంటున్న సర్కార్‌. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం ఉండాలంటున్న ప్రభుత్వం.

  • 26 Dec 2024 10:27 AM (IST)

    కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సినీ ప్రముఖులు

    సీసీసీకి వచ్చిన దిల్‌రాజు, అల్లు అరవింద్‌, మురళీమోహన్‌, నాగార్జున, త్రివిక్రమ్‌, హరీష్ శంకర్, కొరటాలశివ, వశిష్ఠ, సాయిరాజేష్, బోయపాటి, సి.కల్యాణ్, దిల్‌రాజు నేతృత్వంలో హాజరుకానున్న 36 మంది సభ్యులు.  21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు

  • 26 Dec 2024 10:26 AM (IST)

    మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

    సినీ ప్రముఖులతో భేటీకి ముందు కీలక సమావేశం. సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై చర్చ

  • 26 Dec 2024 10:23 AM (IST)

    సీఎం మీటింగ్‌కు చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీ

    చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను మీటింగ్‌కు పిలిచిన సీఎం. అలాగే మీటింగ్‌కి వచ్చిన డీజీపీ జితేందర్‌, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా

  • 26 Dec 2024 10:15 AM (IST)

    కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ

    హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, డీజీపీ జితేంద్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. అలాగే ప్రొడ్యూసర్ నాగ వంశి,దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కూడా చేరుకున్నారు.

  • 26 Dec 2024 10:14 AM (IST)

    కమండ్ కంట్రోల్ కి చేరుకున్న త్రివిక్రమ్, హరీష్ శంకర్

    త్రివిక్రమ్ శ్రీనివాస్ ,హరీష్ శంకర్ మురళీమోహన్,దిల్ రాజు కమండ్ కంట్రోల్ కి చేరుకున్నారు

  • 26 Dec 2024 10:13 AM (IST)

    FDC చైర్మన్‌ దిల్‌రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరు అవుతారు.

    ఈ సమావేశానికి అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, సునీల్‌ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ హాజరవుతారు. ముఖ్యమంత్రితో సమావేశానికి హీరోల తరపున వెంకటేష్‌, నితిన్‌, వరుణ్‌ తేజ్‌, కిరణ్‌ అబ్బవరం, శివబాలాజీ హాజరయ్యే అవకాశం ఉంది.

  • 26 Dec 2024 10:12 AM (IST)

    చిన్నసినిమాలకు థియేటర్స్‌ కేటాయింపు, రాయితీలపై చర్చ

    చిన్నసినిమాలకు థియేటర్స్‌ కేటాయింపు, రాయితీలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే  తెలంగాణ సంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలు, ఈమధ్య సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దుపై చర్చించే అవకాశం

  • 26 Dec 2024 10:10 AM (IST)

    సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చే చాన్స్‌

    తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలి? టాలీవుడ్‌ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ఎలా? గద్దర్‌ అవార్డుల ప్రదానంపైనా చర్చించే అవకాశం ఉంది.

Follow us on