S. V Krishna Reddy: అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది: కృష్ణారెడ్డి

ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమాకు పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. ఇటీవల నెంబర్ వన్ సినిమా నిర్మాణ అనుభవాలు, తన కెరీర్‌లో విజయానికి మూలసూత్రాలను ఆయన వివరించారు. అలాగే ఓ స్టార్ హీరోయిన్ గురించి షాకింగ్ విషయం తెలిపారు కృష్ణ రెడ్డి.

S. V Krishna Reddy: అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది: కృష్ణారెడ్డి
Sv Krishna Reddy

Updated on: Aug 12, 2026 | 6:57 PM

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ సినిమాల స్పీడ్ తగ్గించారు. కాగా గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను,  తన సినీ ప్రయాణం, వృత్తిపరమైన విలువలు అలాగే రాబోయే ప్రాజెక్టుల గురించి పంచుకున్నారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తన సినిమాల్లో సినిమాలలో శుభలగ్నం వంటివి హిందీలో జుదాయి, నో ఎంట్రీ వంటి చిత్రాలుగా రీమేక్ అయ్యి అక్కడ కూడా ఘన విజయాలు సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో తాను చాలా బిజీగా ఉండటం వల్ల హిందీ రీమేక్‌లను డైరెక్ట్ చేయలేకపోయానని, అనిల్ కపూర్ స్వయంగా అడిగినా సాధ్యపడలేదని తెలిపారు. తన చిత్రాలలోని ఆత్మ కథాంశాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయని ఆయన అభిప్రాయపడ్డారు. తన సెట్‌లలో తాను పాటించే క్రమశిక్షణ, అలాగే నటీనటులకు ఇచ్చే గౌరవం గురించి కృష్ణారెడ్డి వివరంగా చెప్పారు.

ఇది కూడా చదవండి : అప్పుడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత చెల్లెలిగా..! ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఆహ్వానం చిత్రం షూటింగ్ చివరి రోజున జరిగిన ఓ సంఘటనను కృష్ణ రెడ్డి గుర్తుచేసుకున్నారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన రమ్యకృష్ణతో జరిగిన ఒక భావోద్వేగ సంఘటనను కృష్ణారెడ్డి పంచుకున్నారు. షూటింగ్ ముగిసిన తర్వాత, రమ్యకృష్ణకు పట్టుబట్టలు, వెండి పళ్లెంలో పది వేల రూపాయలు, కుంకుమ బొట్టు పెట్టి వీడ్కోలు పలికినప్పుడు ఆమె నన్ను పట్టుకొని ఏడ్చేశారని తెలిపారు కృష్ణ రెడ్డి. “అంతటి మర్యాద ఇచ్చేటటువంటి మనం మిగతావి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు,” అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది: నాగార్జున

పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన మీటూ ఉద్యమం, లైంగిక వేధింపుల ఆరోపణలపై కృష్ణారెడ్డి మాట్లాడారు. అలాంటి వార్తలు తాను హెడ్ లైన్ మాత్రమే చూస్తానని, వాటి లోతుల్లోకి వెళ్లనని స్పష్టం చేశారు. “నాకు ఇదంతా కాదు కావాల్సింది. నేను ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్‌కి అనువైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికేస్తానండి నేను,” అని ఆయన అన్నారు. తన దృష్టి అంతా కథాంశంఅలాగే పాత్రలకు సరైన నటీనటులను ఎంచుకోవడంపైనే ఉంటుందని, పరిశ్రమలోని రాజకీయాలు, వివాదాలు తనకు అనవసరమని పేర్కొన్నారు. ఈ ఆరోపణలలో వాస్తవం ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చని, కమిషన్ నివేదిక లేకుండా తాను ఏమీ చెప్పలేనని అన్నారు.

ఇది కూడా చదవండి : అయ్యో పాపం.. కళ్ళు చిదంబరం కళ్ళ వెనక ఇంతా కథ ఉందా.! తెలిస్తే షాక్ అవుతారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us