Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sunaina: పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. సీక్రెట్‏గా ఎంగెజ్మెంట్.. ఫోటోస్ షేర్ చేస్తూ క్లారిటీ..

ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా సునయన పర్సనల్ లైఫ్ గురించి ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ బ్యూటీ ప్రేమలో పడిందని.. ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేసుకుందని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని ప్రచారం కోలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరలయ్యింది. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ అసలు విషయం బయటపెట్టింది. ప్రస్తుతం నెట్టింట తన గురించి వినిపిస్తున్న న్యూస్ నిజమేనంటూ క్లారిటీ ఇచ్చింది.

Actress Sunaina: పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. సీక్రెట్‏గా ఎంగెజ్మెంట్.. ఫోటోస్ షేర్ చేస్తూ క్లారిటీ..
Actress Sunaina
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 07, 2024 | 7:55 PM

టాలీవుడ్ హీరోయిన్ సునయన పెళ్లికి రెడీ అయింది. తెలుగులో పలు చిత్రాలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. కుమార్ వర్సెస్ కుమారి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది సునయన. తెలుగులో హీరో శ్రీవిష్ణు సరసన రాజా రాజా చోరా చిత్రంలో నటించింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ లో బిజీగా ఉంది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా సునయన పర్సనల్ లైఫ్ గురించి ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ బ్యూటీ ప్రేమలో పడిందని.. ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేసుకుందని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని ప్రచారం కోలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరలయ్యింది. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ అసలు విషయం బయటపెట్టింది. ప్రస్తుతం నెట్టింట తన గురించి వినిపిస్తున్న న్యూస్ నిజమేనంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇటీవలే తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని వెల్లడించింది. అలాగే తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అలాగే తనకు అభినందనలు చెప్పే ప్రతి ఒక్కరికీ ముందుగానే కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది. అయితే తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వివరాలు గానీ.. అతడి ఫోటోను మాత్రం షేర్ చేయలేదు. దీంతో నిజంగానే సునయన నిశ్చితార్థం చేసుకుందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

సునయన తమిళంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ 2008లో విడుదలైన కాదలిల్ విడుదెన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పెళ్లికి ముందు ప్రేమకథ, రాజా రాజ చోర, చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్ లలో నటించింది. అలాగో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.