
కన్నడనాటకు చెందిన రష్మిక మందన్నకు ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి డిమాండ్ ఉంది. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. దీంతో రష్మిక మందన్న తరచూ హైదరాబాద్, ముంబై, చెన్నై నగరాల మధ్య తిరుగుతుంటుంది. తాజాగా రష్మిక ముంబై విమానాశ్రయంలో కనిపించింది. దీంతో చాలా మంది ఆమెను గమనించారు. రష్మిక కూడా అందరికీ హాయ్ చెబుతూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో ఒక అభిమాని రష్మికను చూసి ‘ మేడమ్.. మీరు చాలా అందంగా ఉన్నారు, నేషనల్ క్రష్’ అని చెప్పాడు. దీంతో రష్మిక సిగ్గుతో మొగ్గలేసింది. నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ముంబై విమానాశ్రయంలో రష్మిక చాలా సింపుల్ లుక్ లో కనిపించింది. వైట్ టీ- షర్ట్, బ్లూజీన్స్ తో పాటు ఒక బ్యాగుతో ఈ నేషనల్ క్రష్ దర్శనమిచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రష్మిక మందన్న ‘కుబేర’ సినిమా పనుల్లో బిజీగా ఉంది. ఇది ఒక సోషల్ థ్రిల్లర్ సినిమా. ధనుష్, నాగార్జున అక్కినేని, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన కుబేర సినిమా టీజర్ ప్రశంసలు అందుకుంది.
రష్మికకు హిందీ లోనూ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లో ‘థామ’ అనే హారర్ కామెడీ సినిమా చేస్తోందీ అందాల తార.. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరో. దీనితో పాటు, ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలోనూ రష్మిక నటిస్తోంది.
Is it just me, or do you also agree that the right 𝙨𝙘𝙚𝙣𝙩 can 𝙗𝙧𝙞𝙜𝙝𝙩𝙚𝙣 𝙪𝙥 your whole day? I don’t know, it just makes me go hmmmmm… that’s 𝙨𝙤𝙤𝙤 𝙣𝙞𝙘𝙚! 🥰🥰🌸 pic.twitter.com/sRLrpfIfiD
— Rashmika Mandanna (@iamRashmika) May 15, 2025
A little extra sneak peek into my shoot day! ❤️ The vlog is live on YouTube.. Go watch!! 🫶🏻https://t.co/BR7RqkxSvs pic.twitter.com/fxX980649n
— Rashmika Mandanna (@iamRashmika) May 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..