AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darshan Case: దర్శన్‌కు మద్దతుగా టాలీవుడ్ నటి.. రేణుకా స్వామిదే తప్పు అంటూ..

స్టార్ హీరో అయ్యుండి ఒక వ్యక్తిని చంపించడం తో సర్వత్రా చర్చ నడుస్తుంది. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ప్రియురాలి కోసం ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. ఈ హత్య కేసులో అతడు రెండో నిందితుడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ విషయంలో ఒకొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. దర్శన్ చేసింది తప్పని కొందరంటే, దర్శన్ చేసింది తప్పు కాదు అని అభిమానులు అంటున్నారు

Darshan Case: దర్శన్‌కు మద్దతుగా టాలీవుడ్ నటి.. రేణుకా స్వామిదే తప్పు అంటూ..
Darshan
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2024 | 7:38 AM

Share

రేణుకాస్వామి హత్య కేసు రోజు రోజుకు సెన్సేషన్ గా మారుతుంది. కన్నడ ఇండస్ట్రీనే కాదు ఇండియా మొత్తాన్ని ఈ కేసు షేక్ చేస్తుంది. స్టార్ హీరో అయ్యుండి ఒక వ్యక్తిని చంపించడం తో సర్వత్రా చర్చ నడుస్తుంది. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ప్రియురాలి కోసం ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. ఈ హత్య కేసులో అతడు రెండో నిందితుడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ విషయంలో ఒకొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. దర్శన్ చేసింది తప్పని కొందరంటే, దర్శన్ చేసింది తప్పు కాదు అని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సైతం దర్శన్ పై కామెంట్స్ చేశారు. నేరం రుజువైతే శిక్ష పడాల్సిందే అని అంటున్నారు. అయితే తాజాగా నటి కస్తూరి శంకర్ దర్శన్ కు మద్దతుగా మాట్లాడింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ.. రేణుకా స్వామి ఆ అమ్మాయిని వేధించేవాడు. అతనికి ఏమి అవసరం? దర్శన్ చేసింది తప్పే. కానీ, మరి ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి.? ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు కొందరు. అలాంటప్పుడు మెసేజ్ ఎందుకు? దర్శన్ పర్సనల్ లైఫ్ లో ఏ సమస్య వచ్చినా తన మొదటి భార్య దగ్గరుండి చూసుకుంటుంది. ఇది అతని వ్యక్తిగత విషయం’ అని కస్తూరి అన్నారు. అయితే దర్శన్, విజయలక్ష్మి మధ్య పవిత్ర వచ్చిందని రేణుకాస్వామి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీని పై కూడా ఆమె మాట్లాడింది.

సెలబ్రిటీలకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపే హక్కు ప్రజలకు ఎవరిచ్చారు.? దర్శన్ షార్ట్ టెంపర్డ్ పర్సన్. ఆ వ్యక్తిని కొట్టి గుణపాఠం చెప్పాలని దర్శన్, అతని అభిమానులు భావించారు. కాకపోతే అతను చనిపోయాడు. రష్మిక మందన్న ముఖాన్ని ఎడిట్ చేసి మరీ ఇబ్బంది పెట్టారు. అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి ఎవరూ తట్టుకోలేరు’ అని అన్నారు.

‘‘వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు ఇలాగే ఉంటుంది ఇది పెద్ద కాకపోవచ్చు.. కానీ, సినిమా స్టార్స్‌ దీన్ని ఎలా భరించాలి. మీరు ఎంతవరకు సహించగలరు? ప్రజలు కాస్త దయ చూపాలి’ అని అభ్యర్థించారు కస్తూరి. పవిత్ర గౌడకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపారు. అందుకే దర్శన్ అతడి పై దాడి చేశారు. తన గ్యాంగ్‌తో కలిసి రేణుకాస్వామిపై దాడి చేశాడు. దాంతో అతను మరణించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us