AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs Storage in Summer: వేసవిలో గుడ్లు త్వరగా పాడై పోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 నెలలైనా తాజాగా ఉంటాయ్

వేసవి కాలంలో గుడ్లు నిల్వ చేయడం అంత సులువు కాదు. కానీ అసలు సమస్య ఏమిటంటే, వేడి పెరిగే కొద్దీ గుడ్లు త్వరగా పాడైపోతాయనే భయం చాలా మందిలో ఉంటుంది. దీంతో గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా లేక బయట ఉంచాలా అని చాలా మంది సందేహిస్తుంటారు. వాటిని ఫ్రిజ్‌లో ఉంచినా కూడా ఎక్కువ కాలం తాజాగా..

Eggs Storage in Summer: వేసవిలో గుడ్లు త్వరగా పాడై పోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 నెలలైనా తాజాగా ఉంటాయ్
Eggs Storage Tips In Summer
Srilakshmi C
|

Updated on: Apr 05, 2026 | 8:09 PM

Share

ఎండల్లో ఆహారం నిల్వ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా ఈ కాలంలో గుడ్లు నిల్వ చేయడం అంత సులువు కాదు. కానీ అసలు సమస్య ఏమిటంటే, వేడి పెరిగే కొద్దీ గుడ్లు త్వరగా పాడైపోతాయనే భయం చాలా మందిలో ఉంటుంది. దీంతో గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా లేక బయట ఉంచాలా అని చాలా మంది సందేహిస్తుంటారు. వాటిని ఫ్రిజ్‌లో ఉంచినా కూడా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయో లేదోనన్న భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీరు కూడా ఈ గందరగోళంతో బాధపడుతున్నారా? అయితే గుడ్లను తాజాగా ఉంచడానికి ఈ కింది చిట్కాలు పాటించండి..

ఫ్రిజ్‌లోనా లేక బయటనా? గుడ్లు ఎక్కడ నిల్వ చేయాలి..?

వేసవి నెలల్లో గుడ్లను బయట ఉంచకపోవడమే మంచిది. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ గుడ్ల లోపల బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అందువల్ల ఈ కాలంలో గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం సురక్షితం. అయితే రిఫ్రిజిరేటర్ వాడకానికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి.

ఫ్రిజ్ డోర్‌లో గుడ్లు పెడుతున్నారా? ఈ అలవాటును ఈరోజే మార్చుకోండి

చాలా మంది గుడ్లను రిఫ్రిజిరేటర్ డోర్ వద్ద ఉంచుతారు. కానీ ఇదే అతిపెద్ద పొరపాటు. రిఫ్రిజిరేటర్ డోర్‌ను పదేపదే తెరవడం, మూయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలో అత్యధిక హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ పునరావృత ఉష్ణోగ్రత మార్పుల కారణంగా గుడ్ల నాణ్యత త్వరగా క్షీణిస్తుంది. కాబట్టి గుడ్లను ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్ మధ్యలో ఉంచండి. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు స్థిరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గుడ్లను తాజాగా ఎలా ఉంచాలి?

గుడ్లను కేవలం ఫ్రిజ్‌లో పెడితే సరిపోదు. కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తే అవి చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. గుడ్లను నిల్వ చేసేటప్పుడు, సన్నని భాగాన్ని అడుగున, వెడల్పాటి భాగాన్ని పైన ఉంచండి. దీనివల్ల గుడ్డు లోపల ఉన్న పచ్చసొన పూర్తిగా కదలకుండా ఉండి, గుడ్డు సులభంగా కుళ్ళిపోకుండా ఉంటుంది. గుడ్లను మీరు మార్కెట్ నుండి కొన్న అదే కాగితపు ట్రేలో లేదా కార్టన్‌లోనే ఉంచడానికి ప్రయత్నించండి. ఇది గుడ్లను బయటి వాసనల నుంచి కాపాడుతుంది. తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.

చాలా మంది గుడ్లు కొన్న తర్వాత వాటిని నీటితో కడుగుతారు. ఇలా ఎప్పుడూ చేయవద్దు. గుడ్డు పెంకు మీద సహజమైన రక్షణ పొర ఉంటుంది. నీటితో కడగడం వల్ల ఆ పొర నశించి, బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశించి గుడ్డు పాడైపోతుంది. అవసరమైతే వండే ముందు మాత్రమే కడగవచ్చు.

మార్కెట్లో అన్ని గుడ్లు మంచివేనా? ఎలా గుర్తించాలి..?

మార్కెట్ నుండి తెచ్చిన గుడ్లన్నీ తాజాగా ఉంటాయని గ్యారెంటీ లేదు. కాబట్టి తినే ముందు సరిచూసుకోవడం ముఖ్యం. ఒక పాత్రలో లేదా గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. అందులో గుడ్డును వేయాలి. ఒకవేళ గుడ్డు పాత్ర అడుగుకు మునిగిపోతే అది పూర్తిగా తాజాగా ఉందని అర్ధం. అదే గుడ్డు నీటిపై తేలితే, అది కుళ్ళిపోయిందని అర్థం. దాన్ని వెంటనే పారేయండి. ఒకవేళ గుడ్డు నీటిలో నిటారుగా నిలబడి ఉంటే అది మరీ తాజాగా లేదని, కానీ తినడానికి యోగ్యమైనదేనని అర్థం. ఇలాంటి వాటిని త్వరగా తినడమే మంచిది. వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి సరైన పోషకాహారం ఎంత అవసరమో, ఆహార నిల్వ విషయంలో కూడా అంతే జాగ్రత్త వహించాలి. మీరు ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీరు కొన్న గుడ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us