Venu Swamy: పూజలతో స్టార్స్ అయిపోరు.. వేణు స్వామిపై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఆ మధ్యన వేణుస్వామిపై టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాను మెడల్స్ సాధించడానికి వేణుస్వామినే కారణమన్న వార్తలపై మండిపడింది. ఇప్పుడు మరో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ వేణు స్వామి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Venu Swamy: పూజలతో స్టార్స్ అయిపోరు.. వేణు స్వామిపై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Venu Swamy, Dimple Hayathi

Updated on: Jan 04, 2026 | 4:09 PM

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి దగ్గర సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా పూజలు చేయించుకుంటారు. రష్మిక మందన్నా, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, పూర్ణ, ప్రగతి తదితరులు వివిధ సందర్భాల్లో వేణు స్వామి తో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే డింపుల్ హయాతీ కూడా గతంలో వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకుంది. తాజాగా ఇదే విషయంపై స్పందించిన ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో డింపుల్ తో పాటు ఆషిక రంగనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొఒందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా డింపుల్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. ఇదే సందర్భంగా వేణు స్వామి గురించి, తాను జరిపించిన పూజలపై షాకింగ్ కామెంట్స్ చేసింది..

‘కేవలం పూజల వల్ల స్టార్స్ అయిపోతారు అంటే నేను నమ్మను. నేను, రెగ్యులర్ గా టెంపుల్ కు వెళ్తాను. పెద్దవాళ్లు చెప్పారని పూజలు కూడా చేస్తాం. ఎవరో ఏదో అన్నంత మాత్రాన, పూజలు చేసినంత మాత్రాన ఇక్కడ కెరీర్ మారిపోవడం అనేది జరగదు. ఇక్కడ కావాల్సింది కష్టం, ఓపిక అంతే. అయినా నేను ఏంటి అనేది నా వాళ్లకు తెలుసు. దేనికైనా సమయం రావాలి. అప్పుడే అన్ని నిజాలు బయటకు వస్తాయి’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార. ప్రస్తుతం డింపుల్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ప్రమోషన్స్ లో డింపుల్ హయతీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.