Amala Paul: సొంత కొడుకు మతం మార్పించిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎందుకో తెలుసా? ఫొటోస్ వైరల్
2023లో ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో కలిసి రెండోసారి ఏడడుగులు వేసిందీ అందాల తార. గతేడాది వీరికి ఒక పండంటి మగ బిడ్డ జన్మించారు. ప్రస్తుతం తన కుమారుడి ఆలనా పాలనాలోనే బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

తెలుగు ఆడియెన్స్ కు అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ చైతన్య, నాని వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం..ఇలా పలు భాషల్లోనూ సినిమాలు చేసి అక్కడి ఆడియెన్స్ కు చేరువైంది. సినిమాల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగిన అమలాపాల్ పర్సనల్ లైఫ్ లో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది. 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుందీ అందాల తార. అయితే మూడేళ్లకే వీరు విడిపోయారు. అనుకోని కారణాల వలన 2017లో విజయ్ తో విడాకులు తీసుకుంది అమలా పాల్. ఆ తర్వాత 2023లో అమలా జగత్ దేశాయ్ ని వివాహం చేసుకుంది. 2024 జూన్ 11న వీరికి ఇలాయ్ అనే మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే మరోవైపు తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తోంది అమలా పాల్.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అమలా పాల్ తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తన కొడుకుకి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ‘ప్రేమ శాంతితో కూడిన ఇలై బాప్టిజం జరుపుకున్నాడు’ అని రాసుకొచ్చింది అమలాపాల్. బాప్టిజం అంటే క్రైస్తవ మతంలోకి మారడం. ఇప్పుడిదే విషయాన్ని షేర్ చేసింది అమలా పాల్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అమలా పాల్ కుమారుడు చాలా క్యూట్ గా, యువరాజులా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
అమలా పాల్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
భర్త, కుమారుడితో నటి అమలా పాల్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




