AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!

నటుడు రాజా రవీంద్ర తాజా ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని కీలక ఘట్టాలను, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రవితేజ కుటుంబంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రస్తావించారు. అలాగే ఓ స్టార్ హీరో గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Raja Ravindra: ఆ హీరో పెళ్ళికి నేను కాళ్లు కడిగాను.. ఆ ఇద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్..!!
Raja Ravindra
Rajeev Rayala
|

Updated on: Jul 27, 2026 | 10:19 AM

Share

ప్రముఖ నటుడు రాజా రవీంద్ర  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో ఆయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వైవిధ్యమైన పాత్రలు పోశారు రాజా రవీంద్ర. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు అలాగే దిగ్గజ నటులతో తన అనుబంధం గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఒకానొక దశలో సినిమాల్లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు, చిరంజీవి గారు ఇచ్చిన సలహా తనలో ధైర్యాన్ని నింపిందని రాజా రవీంద్ర గుర్తు చేసుకున్నారు. “నీ సినిమా అంటే ఇష్టమా.? ఆ ఇష్టం పోయేదాకా అలా పెట్టుకో, ఇండస్ట్రీలో ఎప్పుడు నీకు వేషాలు ఉంటాయి” అని చిరంజీవి చెప్పిన మాట తన జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నారు. కేవలం నటననే కాకుండా, కాల్ షీట్లు చూసే అదనపు బాధ్యత కూడా తనను ఇండస్ట్రీలో నిలబెట్టిందని తెలిపారు.

ఇది కూడా చదవండి : అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..! ఆ స్టార్ హీరో సినిమాలో నయన తార.?

అలాగే తన కెరీర్‌లో హీరో తమ్ముడి పాత్రల నుంచి విలన్ కొడుకు, అక్క భర్త వంటి అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించినట్లు రాజా రవీంద్ర తెలిపారు. అయితే, చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి తర్వాతి తరం హీరోలు వచ్చాక, వారికి తమ్ముడి పాత్రలు చేయలేక, తండ్రి పాత్రలకు ఇంకా వయసు రాక “జనరేషన్ గ్యాప్” ఏర్పడిందని అన్నారు. ఈ గ్యాప్‌లో టీవీ సీరియల్స్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు, యువ హీరోలతో కలిసి నటించేటప్పుడు, తనకంటూ ప్రత్యేకమైన పాత్రలు మాత్రమే చేయాలనుకుంటానని, పెద్ద హీరోల క్యారెక్టర్లను తగ్గించి తనకు ఇవ్వొద్దని కోరుతానని చెప్పారు.

ఇది కూడా చదవండి : ఆ హీరో నైటీ వేసుకోవడానికి వెనకడుగేశాడు.. అందుకే నేనే ఆ పాత్ర చేశా

రవితేజ, సునీల్ తో ప్రస్తుతం కలిసి పనిచేయకపోవడం గురించి మాట్లాడుతూ, అది ఎటువంటి వివాదాలు లేని, “కంఫర్ట్ లెవల్స్” మారడం వల్లే తీసుకున్న వృత్తిపరమైన నిర్ణయం అని రాజా రవీంద్ర స్పష్టం చేశారు. వారిద్దరూ ఇప్పుడు పెద్ద స్టార్లు అయ్యారని, వారి సౌలభ్యం ముఖ్యమని అన్నారు. వ్యక్తిగత స్థాయిలో తమ మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవని, ఇప్పటికీ తాము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. రవితేజ పెళ్లికి తన “కాళ్లు కడిగానని” కూడా వెల్లడించారు. తమ ఇళ్లలో ఏ ఫంక్షన్ ఉన్నా రవితేజ, సునీల్ కుటుంబాలు హాజరవుతాయని, వారి పిల్లలు కూడా వస్తారని రాజా రవీంద్ర తెలిపారు. తాము ఇద్దరం ఒకే ఊరి (భీమవరం) నుంచి వచ్చామని, సునీల్ కూడా ఒక దశలో హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి, బాగా బిజీ అయ్యాడని గుర్తు చేశారు. సినీ పరిశ్రమలో ఏదీ శాశ్వతం కాదని, పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చని, ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా కనబడతాయని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..! అందరం ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం

Raviteja

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
18 కోట్లతో లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ల కోసమే సినిమా.. 14 ఏళ్లుగా..
18 కోట్లతో లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ల కోసమే సినిమా.. 14 ఏళ్లుగా..
ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం లైన్ క్లియర్..
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం లైన్ క్లియర్..
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పాతకాలపు ఉసిరికాయ తొక్కు పచ్చడి
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పాతకాలపు ఉసిరికాయ తొక్కు పచ్చడి