Noel : నేను ఆమెను టార్చర్ చేశానని చెప్పింది.. ఎంతో బాధేసింది.. ఎమోషనల్ అయిన నోయల్

|

Oct 17, 2024 | 3:57 PM

నోయల్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు. ర్యాపర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నోయల్.. కుమారి 21 ఎఫ్ లో నెగిటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ సింగర్.

Noel : నేను ఆమెను టార్చర్ చేశానని చెప్పింది.. ఎంతో బాధేసింది.. ఎమోషనల్ అయిన నోయల్
Noel,ester Noronha
Follow us on

నోయెల్ సీన్..  ర్యాప్ సింగర్ గా కెరీర్ మొదలు పెట్టిన నోయాల్ నటుడిగాను మెప్పించాడు. సంగీత దర్శకుడు కీరవాణి నోయల్ కు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా విక్రమార్కుడు లో ర్యాప్ సాంగ్ చేసే అవకాశం కల్పించారు. దాంతో నోయల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి తెలుగు రాపర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నోయల్. అలాగే నోయల్ రేడియో జాకీగాను చేశాడు. నోయల్ ఎన్నో సూపర్ సాంగ్స్ పాడాడు. ఇక నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నోయల్.. కుమారి 21 ఎఫ్ లో నెగిటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ సింగర్. అయితే నోయల్ వ్యక్తిగత జీవితం విషయంలో గతంలో వార్తల్లో నిలిచాడు.

ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

నోయల్ ఓ హీరోయిన్ ను వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన కొద్దిరోజులకే ఈ ఇద్దరూ విడిపోయారు. ఆమె ఎవరో కాదు ఎస్త‌ర్ నోరోన్హా. ఈ అమ్మడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఇదిలా ఉంటే తాజాగా నోయల్ తన మాజీ భార్య మాట్లాడాడు. ఓ ఇంటర్వ్యూలో నోయల్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!

నేను ఆమె( ఎస్త‌ర్ నోరోన్హా) విషయంలో  ఎప్పుడూ పాజిటివ్ గానే ఉండేవాడిని.. ఇప్పుడు కూడా అలానే ఉన్నా.  ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్లే.. అందరూ నా వాళ్లే అనుకునేవాడిని నేను. కానీ ఆమె ఒక ఇంటర్వ్యూలో నా గురించి చాలా కామెంట్స్ చేసింది. నాగ్ గురించి ఆమె చెప్పగానే.. నాతో ఉన్న వాళ్లు నాకు దూరం అయ్యారు. నేను ఒప్పుకున్నా సినిమా ఆఫర్స్ కూడా చేజారిపోయాయి . అప్పుడే నాకు జీవితం అంటే ఏంటో అర్ధమైంది అని అన్నారు నోయల్. అయితే లే నా చుట్టూ అంతా క్లిన్ చేసింది లే అని పాజిటివ్ గా ఫీల్ అయ్యా.. నేను ఆమెను టార్చర్ చేశానని చెప్పింది. కానీ మా జర్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉండేది అని నేను అంటాను. మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే, వాళ్లను మనం ఏమీ అనలేము.. నేనూ అంతే. నాపై తనకి ప్రేమ లేకపోవచ్చు.. కానీ నాకు ప్రేమ ఉంది. లవ్ లో ఉన్నప్పుడు బ్రేకప్ అయితే చాలా బెటర్.. ఇద్దరికి మాత్రమే ఆ బాధ ఉంటుంది. అదే పెళ్లి అయిన తరువాత విడిపోతే ఇద్దరి ఫ్యామిలీస్‌కు ఎఫెక్ట్ అవుతుంది అని నోయల్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.