Tollywood: రావణాసురుడి గెటప్‌లో టాలీవుడ్ విలన్.. వీడియో వైరల్.. ఎవరో గుర్తు పట్టారా? భార్య కూడా ప్రముఖ నటినే

తెలుగుతో పాటు వివిధ భాషల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన ఈ నటుడు ఉన్నట్లుండి రావణాసురుడి గెటప్ లో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Tollywood: రావణాసురుడి గెటప్‌లో టాలీవుడ్ విలన్.. వీడియో వైరల్.. ఎవరో గుర్తు పట్టారా? భార్య కూడా ప్రముఖ నటినే
Tollywood Actor

Updated on: Jul 23, 2025 | 8:43 PM

రామాయణంపై ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రణ్ బీర్ కపూర్, సాయి పల్లవిల రామాయణ్. ఇందులో కన్నడ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. అయితే ఇదే రామయాణాన్ని ఆధారంగా చేసుకుని మరికొన్ని భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు రావణాసురుడి గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పై ఫొటో అదే. మరి అందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా? విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారాయన. అలాగే హిందీ సినిమాల్లోనూ మెరిశారు. తెలుగులో అయితే పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రవితేజ, కల్యాణ్ రామ్, నాగ చైతన్య తదితర హీరోల సినిమాల్లో నటించాడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ మెరిశాడు. తమిళం, కన్నడ, మరాఠీ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రావణాసురుడిగా కనిపించి ఫ్యాన్స్‌ కు షాక్ ఇచ్చారు. ఆయన మరెవరో కాదు అశుతోష్ రాణా. మాస్ మహారాజ్ హీరోగా చేసిన వెంకీ సినిమాలో విలన్ రోల్ తో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ నటించిన బంగారం సినిమాలో భూమారెడ్డి పాత్రలోనూ అదరగొట్టారు.

 

ఇవి కూడా చదవండి

అయితే తాజాగా అశుతోష్ రాణా రావణాసురుడి గెటప్ లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనికి హర హర మహదేవ్ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చారు. అయితే సడెన్ గా ఇలా రావణుడిగా కనిపించడానికి కారణమేంటో చెప్పలేకపోయారు అశోతోష్. ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ లో రావణాసురుడి రోల్ వేస్తున్నారా? లేదా ఇంకేదైనా కార్యక్రమమా? అని క్లారిటీ ఇవ్వలేకపోయారు.

రావణుడి గెటప్ లో అశుతోష్ రాణా.. వీడియో..

అన్నట్లు అశుతోష్ రాణా సతీమణి రేణుక శహానే. కూడా ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మనీ సినిమాలో కథానాయికగా నటించింది రేణుక. అంతకు ముందు హిందీలో పలు సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో ఒక్క మనీ మూవీలోనే నటించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.

భార్య రేణుకతో అశుతోష్ రాణా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..