AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. పేరు వింటేనే చాలు పడిచచ్చిపోతారు.. హాలీవుడ్ హీరోలను మించిన ఫాలోయింగ్..

సోషల్ మీడియాలో ఎప్పుడూ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఒక అరుదైన 'త్రోబాక్' పిక్ ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటోలో సీనియర్ నటి గీత పక్కన నిలబడి ఎంతో అమాయకంగా చూస్తున్న ఆ చిన్న కుర్రాడు.. ప్రస్తుత భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక క్రేజ్ , రెమ్యునరేషన్ అందుకుంటున్న టాప్ గ్లోబల్ స్టార్లలో ఒకరు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. పేరు వింటేనే చాలు పడిచచ్చిపోతారు.. హాలీవుడ్ హీరోలను మించిన ఫాలోయింగ్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: May 30, 2026 | 7:39 PM

Share

సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల పాత ఫోటోలు, మరీ ముఖ్యంగా వారు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ఉన్నప్పటి జ్ఞాపకాలు ‘త్రోబాక్ ‘ వేదికగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా నెట్టింట ఒక అరుదైన పాత ఫోటో నెటిజన్లకు ఒక ఆసక్తికరమైన పజిల్‌ను విసిరింది. ఆ ఫోటోలో ఉన్న సీనియర్ నటి గీత వెనుక నిలబడిన ఆ చిన్న కుర్రాడు.. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ సూపర్ స్టార్లలో ఒకరు. ఆయనే మన టాలీవుడ్ ‘ప్రిన్స్’ ఘట్టమనేని మహేష్ బాబు. వైరల్ అవుతున్న ఈ ఫోటో ఈనాటిది కాదు, సరిగ్గా 1990లో విడుదలైన ‘బాలచంద్రుడు’ సినిమా షూటింగ్ సమయానిది. మహేష్ బాబు తండ్రి, నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు బాలనటుడిగా (చైల్డ్ ఆర్టిస్ట్‌గా) లీడ్ రోల్ పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఈ సినిమాలో నటి గీత ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. షూటింగ్ సెట్స్‌లో గీత వెనుక నిలబడి ఎంతో అమాయకంగా, క్యూట్‌గా చూస్తున్న చిన్ననాటి మహేష్ బాబు లుక్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. మహేష్ బాబు తన కెరీర్‌ను కేవలం నాలుగేళ్ల వయసులోనే ‘నీడ’ (1979) చిత్రం ద్వారా అతిథి పాత్రతో ప్రారంభించారు. ఆ తర్వాత బాలనటుడిగా దాదాపు ఎనిమిదికి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 1999లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘రాజకుమారుడు’ సినిమాతో ఆయన పూర్తిస్థాయి హీరోగా మారారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ఆ తర్వాత మురారి (2001), ఒక్కడు (2003), అతడు (2005), పోకిరి (2006), దూకుడు (2011), శ్రీమంతుడు (2015), భరత్ అనే నేను (2018), మహర్షి (2019) వంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ ‘బిజినెస్‌మ్యాన్’గా అవతరించారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి చేయబోయే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అడ్వెంచర్ ప్రాజెక్ట్ వారణాసి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ పాత ఫోటోను చూసిన అభిమానులు “అప్పుడు బాలచంద్రుడు.. ఇప్పుడు గ్లోబల్ స్టార్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

మహేష్ బాబు పోస్ట్… 

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us