OTT Movie: కేవలం 30 లక్షలతో నిర్మించారు.. ఓటీటీలోనే సంచలనం సృష్టించింది.. పెద్ద స్టార్ హీరోస్ లేకపోయినా..

ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథలను ఆదరించేందుకు అడియన్స్ ముందుంటున్నారు. అలాగే మిస్టరీ, సస్పెన్స్, హర్రర్ చిత్రాలకు ఓటీటీలో ఊహించని రెస్పాన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే ఓ వెబ్ సిరీస్ మాత్రం ఓటీటీ ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. పెద్ద స్టార్స్ లేకపోయినా అత్యధిక వ్యూస్ అందుకుంది.

OTT Movie: కేవలం 30 లక్షలతో నిర్మించారు.. ఓటీటీలోనే సంచలనం సృష్టించింది.. పెద్ద స్టార్ హీరోస్ లేకపోయినా..
Gullak

Updated on: Jun 07, 2025 | 9:46 AM

మీరు ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా.. ? కామెడీ జానర్ చిత్రాలతోపాటు.. ఆద్యంతం ట్విస్టులతో కట్టిపడేసే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే ఈ సిరీస్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. కామెడీ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సిరీస్ సరైన ఎంపిక. ఇప్పటివరకు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక కామెడీ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ మాత్రం మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం IMDBలో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకుంది. ఆ సిరీస్ పేరు గుల్లక్. ఇది మధ్య తరగతి కుటుంబం పోరాటాన్ని చిత్రీకరిస్తుంది. ఈ సిరీస్ కథాంసం, వాస్తవిక పాత్రలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్ లో ఇప్పటివరకు నాలుగు సీజన్స్ విడుదలయ్యాయి.

ప్రతి సీజన్ ఓటీటీలో భారీ విజయాన్ని అందుకుంది. ఆద్యంతం ఎంతో సహజంగా, కామెడీతో ఈ సాగే ఈ సిరీస్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. అలాగే ఫస్ట్ సీజన్ చూసిన అడియన్స్ ఆ తదుపరి వచ్చే సీజన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఇందులో సంతోష, శాంతి మిశ్రా దంపతలకు ఇద్దరు కుమారులు ఆనంద్, అమన్. వీరితోపాటు పొరుగున ఉన్న బిట్టు కి మమ్మీ పాత్రల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. మిశ్రా కుటుంబం చిన్న పట్టణ జీవితం. ఉద్యోగం, కుటుంబం సంబంధాల సమస్యలను ఎదుర్కొంటుంది. కానీ వాటిని హృదయానికి హత్తుకునేలా చూపిస్తూనే కామెడీ, సవాళ్లను, ఆప్యాయతల నేపథ్యంలో చిత్రీకరించారు.

శ్రేయాన్ష్ పాండే ‘ది వైరల్ ఫీవర్’ (TVF) బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో జమీల్ ఖాన్, గీతాంజలి కులకర్ణి, వైభవ్ రాజ్ గుప్తా, హర్ష్ మేయర్, సునీతా రాజ్‌వర్ కీలకపాత్రలు పోషించారు. కేవలం రూ.30 లక్షలతో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోనే పెను తుఫాను సృష్టించింది. ఈ సినిమా కలెక్,న్స్ క్రౌడ్ ఫండింగ్, ప్రమోషన్స్ ద్వారా పొందారు. ఇది ప్రతి సీజన్‌లో 5 ఎపిసోడ్‌ల ఈ మినీ సిరీస్. దీనికి IMDbలో 10కి 9.1 అద్భుతమైన రేటింగ్‌ ఉంది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..