
80, 90లలో బాలీవుడ్ ప్రపంచంలో అగ్ర కథానాయికగా చక్రం తిప్పిన హీరోయిన్లలో ఆమె ఒకరు. మాధురీ దీక్షిత్, ఐశ్వర్యరాయ్ వంటి హీరోయిన్లకు గట్టిపోటీనిచ్చింది. చాలా చిన్న వయస్సులోనే పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్ ఆమె. 16 సంవత్సరాల వయసులోనే బాలీవుడ్‌లోకి ప్రవేశించి, ఆ కాలంలోనే రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే చేసిన ఒక్క తప్పు చివరకు సినిమాలకు దూరమయ్యేలా చేసింది. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీకి దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఆమె మరెవరో కాదు సోనమ్ ఖాన్. బక్తవర్ ఖాన్ అనే జన్మస్థలం.
ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..
1988లో విజయ్ సినిమాలో కనిపించింది. మొదటి సినిమాతోనే గ్లామర్, బోల్డ్ సన్నివేశాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. 1989లో సన్నీ డియోల్, మాధురి దీక్షిత్, నసీరుద్దీన్ షా, జాకీ ష్రాఫ్‌లతో కలిసి త్రిదేవ్‌తో కలిసి నటించడంతో ఆమె పేరు మారుమోగింది. విశ్వాత్మ, అజూబా, గూలా బరూద్, ఆస్మాన్ సే ఊంచా, ఫతే, క్రోధ్, అప్మాన్ కీ ఆగ్, హమ్ భీ ఇన్సాన్ హై, మిట్టి ఔర్ సోనా హిట్ చిత్రాల్లో నటించింది.
ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్..
త్రిదేవ్ సినిమా సమయంలో ఆమె ఆ మూవీ డైరెక్టర్ రాజీవ్ రాయ్ తో ప్రేమలో పడింది. వీరిద్దరు 1991లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమె వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఏడాదికే వీరికి బాబు జన్మించారు. ఆ తర్వాత డైరెక్టర్ రాజీవ్ విదేశాల్లో సెటిల్ అయ్యారు. దీంతో సోనమ్ తన కెరీర్ వదులుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంది.
ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..
Sonam Khan. New
ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..