AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ilayaraja & Maniratnam Birthdays: మ్యాజికల్ ద్వయం.. మణిరత్నం, ఇళయరాజా కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ఇవే..

జూన్ 2న మణిరత్నం, ఇళయారాజా పుట్టినరోజు. ఈ మ్యాజికల్ ద్వయం నుంచి వచ్చిన అద్భుతమైన పాటల గురించి తెలుసుకుందామా..

Ilayaraja & Maniratnam Birthdays: మ్యాజికల్ ద్వయం.. మణిరత్నం, ఇళయరాజా కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ఇవే..
Ilayaraja Maniratnam
Rajitha Chanti
|

Updated on: Jun 02, 2022 | 8:49 AM

Share

మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా.. డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్ధరి కాంబోలో ఎన్నో అద్భుతమైన పాటలను సినీప్రియులకు అందించారు. జూన్ 2న మణిరత్నం, ఇళయారాజా పుట్టినరోజు. ఈ మ్యాజికల్ ద్వయం నుంచి వచ్చిన అద్భుతమైన పాటల గురించి తెలుసుకుందామా..

మౌనరాగం.. 1986లో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో మోహన్, కార్తీక్ రేవతి, శోభన, భానుప్రియ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ముఖ్యంగా చిన్ని చిన్ని కోయిలమ్మ పాట ఇప్పటికీ ప్రత్యేకమే.

దళపతి.. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్, మమ్ముట్టి, శోభన, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమా దళపతి. ఈ సినిమాకు కింగ్ ఆఫ్ మేలోడి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీలోని ప్రతి పాట సూపర్ హిట్.

గీతాంజలి.. 1989లో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి సినిమా సంచలన విజయం సాధించింది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆయన కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీలోని ఓ ప్రియా.. ప్రియా పాట ఇప్పటికీ శ్రోతల మనసులను హత్తుకుంటుంది.

ఘర్షణ.. డైరెక్టర్ మణిరత్నం.. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కాంబోలో వచ్చిన చిత్రం ఘర్ణణ. కార్తీక్, అమల అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా ప్రతి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్ను కోరి వర్ణం సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకులు మెచ్చేసాంగ్.

గీతాంజలి.. నాగార్జున, గిరిజ కలిసి నటించిన గీతాంజలి సినిమాలోని ఓ పాప లాలి సాంగ్ ఆల్ టైమ్ హిట్. ఈ పాట ఇప్పటికీ శ్రోతల మనసుకు చేరువైనది..