AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వచ్చే వారం టాలీవుడ్‌లో అలరించడానికి రెడీఅవుతున్న సినిమాలు ఇవే..

చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే వారం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో  ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ సినిమా గురించి. రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ యాక్షన్ హీరో.

Tollywood: వచ్చే వారం టాలీవుడ్‌లో అలరించడానికి రెడీఅవుతున్న సినిమాలు ఇవే..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Apr 30, 2023 | 9:40 AM

Share

టాలీవుడ్ లో వరుస సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే వారం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో  ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ సినిమా గురించి. రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ యాక్షన్ హీరో. శ్రీ వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత వస్తోన్న సినిమా అల్లరి నరేష్ నటించిన ఉగ్రం. ఈ సినిమా కూడా మే 5 న ఈ సినిమా రానుంది. అల్లరి నరేష్ హీరో గా విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఉగ్రం మూవీ ట్రైలర్, టీజర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాలో అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత అక్కినేని నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా రానుంది. మే 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్నఈ సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోంది. అన్ని మంచి శకునంలే మూవీ మే 18 వ తేదీన.. సామజవర గమన మూవీ మే 19 వ తేదీన విడుదల కానుంది. బిచ్చగాడు 2 మూవీ మే 19 వ తేదీన, నవీన్ పోలిశెట్టి అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మే 26 వ తేదీన విడుదల కానుంది.

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?