AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 8 కోట్లతో తీస్తే రూ.15 కోట్ల కలెక్షన్స్.. 1996లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. కుర్రాళ్లకు ఒక ఎమోషన్..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ రిలీజ్ అయి దశాబ్దాలు గడిచినప్పటికీ ఏమాత్రం తగ్గని డిమాండ్ తో.. ఇప్పటికీ యూట్యూబ్ లో హావా కొనసాగిస్తున్న సినిమా గురించి మీకు తెలుసా.. ? అందులోని పాటలు సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..

Cinema : 8 కోట్లతో తీస్తే రూ.15 కోట్ల కలెక్షన్స్.. 1996లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. కుర్రాళ్లకు ఒక ఎమోషన్..
Prema Desham Movie
Rajitha Chanti
|

Updated on: Jul 10, 2026 | 10:37 AM

Share

1996లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా అది. ముఖ్యంగా అప్పట్లో యువతకు పిచ్చెక్కించేసింది. ఇక అందులోని పాటల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ సోషల్ మీడియా, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అప్పట్లో థియేటర్లలో ఆ పాటలు వింటే కుర్రకారు సీట్లలోంచి లేచి డ్యాన్సులు చేసేవాళ్లు. ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మూవీ పేరు ప్రేమదేశం. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ముస్తఫా.. ముస్తఫా పాట కాలేజీ కుర్రాళ్లకు ఒక ఎమోషన్. కాలేజ్ కుర్రాళ్ల స్నేహాన్ని, ప్రేమని వెండితెరపై అద్భుతంగా చూపించిన క్లాసిక్ లవ్ స్టోరీ అది. ఇందులో అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీనే ఆ ముగ్గురి జీవితాలను మార్చేసింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఓ ఊపు ఊపింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కె.టి కుంజుమెన్ నిర్మించారు.

ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్..

అప్పటికే ఆయన జెంటిల్మెన్, ప్రేమికుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రం స్టోరీని దర్శకుడు కదిర్ చెప్పారు. దీంతో ఈ మూవీని నిర్మించాలని ఫిక్స్ అయ్యారు కుంజుమెన్. కానీ దర్శకుడు, నిర్మాత మధ్య చిన్న అభిప్రాయ బేధం వచ్చింది. ఈ సినిమాను శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ అయితేనే న్యాయం చెయగలరని ఎంతో మంది అభిప్రాయ పడ్డారు. కానీ నిర్మాత మాత్రం దర్శకుడు కదిర్ పై నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ మూవీలోని పాటలు బాక్సాఫీస్ షేక్ చేశాయి.

ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్..

ఈ సినిమాలోని కాలేజీ వాతావరణాన్ని, రిచ్ లుక్ తీసుకురావడానికి అప్పట్లోనే దాదాపు మూడు కోట్లతో సెట్ నిర్మించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ సినిమాను క్లైమాక్స్ లోని స్నేహానికి ఇచ్చిన విలువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో అబ్బాస్ అప్పట్లో అమ్మాయిల కలల రాకూమారుడిగా మారిపోయారు. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood: చాలా టార్చర్ చేశారు.. ట్రైన్‏లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

ఎక్కువమంది చదివినవి : నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..

Follow Us