Ayodhya Ram Mandir : మరికొద్ది సేపట్లో అపూర్వఘటం..170కిపైగా మల్టీప్లెక్స్‌ల్లో ప్రత్యక్షప్రసారం
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం మరికొద్ది సేపట్లో జరుగుతున్న తరుణంలో చారిత్రక వేడుకను చూసేందుకు యావత్‌దేశం ఎదురుచూస్తోంది. సుదీర్ఘ స్వప్నం మరికొద్ది సమయంలో సాకారం కాబోతోండడంతో కోట్లాది కళ్లు ఆమహాఘట్టం కోసం వేచిచూస్తున్నాయి. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 1గంటకు ముగియనుంది.
యావత్‌దేశం వేచిచూస్తోన్న సుదీర్ఘ స్వప్నం మరికొద్ది సేపట్లో సాకారం కాబోతోంది. ఎన్నో శతాబ్ధాల కల నెరవేరబోతున్న క్షణాలను లైవ్‌లో ప్రత్యక్షంగా చూసేందుకు అటు టీటీడీతో పాటు పీవీఆర్, ఐనాక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయోధ్య రామయ్య ప్రాణప్రతీష్టా కార్యక్రమాన్ని మినిట్‌టూ మినిట్ లైవ్‌లో అందించే ఏర్పాట్లు చేశాయి. అయోధ్యలో అణువణువు రామమయం. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం మరికొద్ది సేపట్లో జరుగుతున్న తరుణంలో చారిత్రక వేడుకను చూసేందుకు యావత్‌దేశం ఎదురుచూస్తోంది. సుదీర్ఘ స్వప్నం మరికొద్ది సమయంలో సాకారం కాబోతోండడంతో కోట్లాది కళ్లు ఆమహాఘట్టం కోసం వేచిచూస్తున్నాయి. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 1గంటకు ముగియనుంది. ఆతర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. దాదాపు 7వేల మంది అతిథులు పాల్గొనే ఈ మహాఘట్టాన్ని కోట్లాది ప్రజలు టీవీలు.. ఆన్‌లైన్ వేదికల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తులకు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అయోధ్యలోని సరయూ ఘాట్‌లో దేశంలోనే అతిపెద్ద LED ఫ్లోటింగ్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. 69 అడుగుల పొడవు.. 16 అడుగుల ఎత్తైన ఎల్ఈడీ స్కీన్ ను ఏర్పాటు చేశారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు గుజరాత్‌లోని ఓ సంస్థ ఈస్క్రీన్‌ను రూపొందించింది. మరోవైపు రామ్‌లల్లా ప్రాణప్రతిష్టణు భక్తజనులకు అందించేందుకు టీటీడీ కీలకనిర్ణయం తీసుకుంది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) తమిళం, కన్నడ, హిందీ ఛానళ్లలో ప్రత్యక్షప్రసారం చేయనుంది. అదే విధంగా ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయోధ్యలో జరిగే వైదిక, ఆధ్యాత్మిక క్రతువులను నిరంతరాయంగా ప్రత్యక్షప్రసారం చేయనుంది. దూరదర్శన్ ఛానెల్‌లో ఈ కార్యక్రమాన్ని జనవరి 22వ తేదీ ఉదయం 11 గంటల్నించి మద్యాహ్నం 1 గంట వరకూ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కోసం దూరదర్శన్ అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో 40 కెమేరాలు ఏర్పాటు చేసింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 4 కే టెక్నాలజీతో ప్రసారం కానుంది.
అంతేకాదు ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు పీవీఆర్, ఐనాక్స్‌లు అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలను పెద్ద స్క్రీన్లపై చూసే అవకాశం కల్పిస్తున్నాయి. రూ.100 టికెట్‌తో థియేటర్లలో కార్యక్రమాన్ని వీక్షించవచ్చని పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతం దత్తా తెలిపారు. దీని కోసం దేశంలోని 70 ప్రధాన నగరాల్లో 170కిపైగా స్క్రీన్‌లలో అయోధ్య రాముడి పండగను ప్రత్యక్ష ప్రసారం చేసందుకు పీవీఆర్, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. ఈ ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో పీవీఆర్, ఐనాక్స్ ఒప్పందం చేసుకున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిగ్ స్క్రీన్‌పై ఈ మహాక్రతువును వీక్షించవచ్చని ఆ సంస్థలు ప్రకటించాయి. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను విదేశాల్లోనూ పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వాషింగ్టన్ డీసీ మొదలుకొని పారిస్, సిడ్నీ వరకు దాదాపు 60 దేశాల్లో విశ్వహిందూ పరిషత్, పలు హిందూ సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి