అమ్మబాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయిందేంటీ..!! ఒకప్పుడు కుర్రాళ్ళుకు పిచ్చెక్కించింది
ఏం అందం అని కొంతమందికి అనిపిస్తే.. మరికొంతమందిని చూస్తే మన లవర్ కూడా ఇలానే ఉండాలి అని అనిపిస్తుంది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా అలా కుర్రకారును కట్టిపడేసిన భామనే.. అందం అభినయంతో పాటు క్యూట్ నెస్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంది. ఈ అమ్మడిని చూడగానే ఎవరైనా టక్కున లవ్ లో పడిపోతారు.
చాలా మంది హీరోయిన్స్ తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకొని ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. చూడగానే అబ్బబ్బా.. ఏం అందం అని కొంతమందికి అనిపిస్తే.. మరికొంతమందిని చూస్తే మన లవర్ కూడా ఇలానే ఉండాలి అని అనిపిస్తుంది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా అలా కుర్రకారును కట్టిపడేసిన భామనే.. అందం అభినయంతో పాటు క్యూట్ నెస్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంది. ఈ అమ్మడిని చూడగానే ఎవరైనా టక్కున లవ్ లో పడిపోతారు. ఇంతకు ఆ బ్యూటీని గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఆ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఉంది. అందం అభినయంకే కాదు ఆమె వాయిస్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..?
పై ఫొటోలో క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన హీరోయిన్ మరెవరో కాదు. ఒకానొకప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి మహేశ్వరి. 1995లో వచ్చిన అమ్మాయి కాపురం సినిమాతో సినిమాల్లోకి వచ్చింది ఈ భామ. అదే ఏడాది వచ్చిన గులాబీ సినిమాతో మంచి విజయాన్ని మాత్రమే కాదు విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత 1997లో వచ్చిన పెళ్లి సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది.
ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. పెళ్లితర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. 2003 నుండి 2014 మధ్యకాలంలో ఈమె కొన్ని తమిళ, తెలుగు టెలివిజన్ సీరియళ్ళలోను నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫ్యాషన్ డిజైనర్‌గా మారి “మహే అయ్యప్పన్” అనే పేరుతో ఒక స్టోర్‌ను హైదరాబాద్ లో ఓపెన్ చేసింది. స్టార్ హీరోయిన్ శ్రీదేవి మహేశ్వరికి దగ్గర బంధువు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేశ్వరి తాజాగా కొన్ని క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.
View this post on Instagram
మహేశ్వరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి