
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన తండేల్ ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 07) న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీకి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాగ చైతన్య సినిమా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. రిలీజైన రెండు రోజుల్లోనే రూ. 40 కోట్లకు పైగా వసూళ్ల సాధించింది. ఈ లెక్కన చూస్తే మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్కును దాటనుంది. అయితే తండేల్ విడుదలైన రెండో రోజే ఆన్‌లైన్ లీక్ కావడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండేల్ సినిమాను పైరసీ చేసి కొందరు ఆన్‌లైన్‌లో అప్‌చేయడం గమనార్హం. ఓ లోకల్ ఛానల్‌లోనూ ఈ మూవీ ప్రసారమైంది. తాజాగా పైరసీ వ్యవహారంపై తండేల్ మూవీ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఇప్పటికీ పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీకి అవరోధంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పనులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాను సైతం లోకల్ ఛానెల్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు తండేల్‌ను పైరసీ చేసినవారిని కేసులు పెడతామని నిర్మాత బన్నీవాసు హెచ్చరించారు.
‘సినిమా పైరసీ వస్తుంది.. చూసేద్దామని చాలా మంది అనుకుంటుంటారు. మా బ్యానర్ లో తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమా పైరసీ చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. వారిలో కొందరు ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వస్తున్నారు. ‘గీతా ఆర్ట్స్’ సినిమాలను పైరసీ చేసిన వారిని, వాటిని డౌన్‌లోడ్ చేసుకుని చూసిన వారిని తేలిగ్గా వదిలేస్తామని అసలు అనుకోవద్దు. ఈ సినిమా పైరసీ చూసే వారు నాకు ఎక్కడ కనిపించినా కేసులు పెడతా. ఈ రెండు రోజులు సక్సెస్ మూడ్‌లో ఉన్నాం. ఇకపై పైరసీ చేసిన వారిపై దృష్టి పెడతాం’ అని బన్నీవాసు హెచ్చరించారు.
An energetic reception for Yuvasamrat @chay_akkineni & Team #Thandel at Eluru ❤️🔥
రాజులమ్మ జాతరే in every town and every theatre 💥💥Celebrating the #BLOCKBUSTERLOVETSUNAMI with the audience today 🌊🔥
Next stop – Rajahmundry – Geetha Apsara Theatre, evening show.Book your… pic.twitter.com/676p1UOY4a
— Geetha Arts (@GeethaArts) February 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.