Thandel: బాక్సాఫీస్ వద్ద తండేల్ బీభత్సం.. మూడు రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే..

డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ తండేల్. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Thandel: బాక్సాఫీస్ వద్ద తండేల్ బీభత్సం.. మూడు రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయంటే..
Thandel Movie

Updated on: Feb 10, 2025 | 12:30 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది తండేల్. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ డే నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మొదటి రోజే ఈ సినిమాకు రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. అలాగే రెండు రోజుల్లోనే ఏకంగా రూ.40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక వీకెండ్ కావడంతో ఆదివారం బుకింగ్స్ మరింత పెరిగాయి. దీంతో మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తుంది తండేల్. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.60 కోట్ల మార్క్ క్రాస్ చేసి మొత్తం రూ.62 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు థియేటర్లలో తండేల్ జోరు చూస్తుంటే ఈ వారంలోనే వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సాయి పల్లవి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఈ సినిమాపై ముందు నుంచి చైతన్య ఎక్కువగానే నమ్మకం పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇందులో చైతూ యాక్టింగ్ ఇరగదీశాడు. లవ్ స్టోరీ తర్వాత చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసింది. వీరిద్దరి యాక్టింగ్, డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ ఈ సినిమాకు ప్రధాన బలంగా ఉన్నాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు స్పెషల్ హైలెట్ అయ్యింది మ్యూజిక్. ఈ చిత్రం చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమాను రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలోనూ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన