
సాధారణంగా సినిమాల్లో ఫేమస్ అయిన డైలాగులు సోషల్ మీడియాలో వినిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యన అంతా రివర్స్ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయిన డైలాగులు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై దర్శనమిస్తున్నాయి. చిరంజీవి గాడ్ ఫాదర్‌లో కేసీపీడీ, రవితేజ క్రాక్ సినిమాలో దుర్గారావ్ సాంగ్, వినరో భాగ్యము విష్ణు కథలో ‘అగ్గిపెట్టె’ మచ్చ డైలాగులను వాడేశారు. ఇప్పుడు మరొక ఫేమస్ డైలాగ్ పాట రూపంలో వెండితెరపై వినపడనుంది. మహేశ్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల కథానాయకి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోన్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ నుంచి తాజాగా ఒక పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ సాంగ్ లిరిక్స్‌లో ‘కుర్చీ మడతపెట్టి’ అనే బూతు పదం వాడడంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేశ్- శ్రీలీల మాస్ స్టెప్పులు అభిమాలను అలరిస్తున్నప్పటికీ, లిరిక్స్‌పై మాత్రం నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన షేక్ అహ్మద్ పాషా తన జీవిత కథను చెబుతూ ఈ డైలాగ్‌ను ఉపయోగించాడు. అప్పటి నుంచి ఈ డైలాగ్ బాగా వైరలైపోయింది. బూతు ఉన్నా చాలామంది రీల్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా మహేశ్ బాబు సినిమాలో వాడేశారు.
మహేశ్ బాబు సినిమాలో తన డైలాగ్ వాడడంపై షేక్ అహ్మద్ పాషా స్పందించారు.. ‘మహేశ్ లాంటి స్టార్ హీరో సినిమాలో నా డైలాగ్‌ను పాటగా వాడుకోవడం సంతోషంగా ఉంది. ఒకవేళ నాకు అవకాశమొస్తే ఈ సాంగ్‌లో ఒక స్టెప్ అయినా వేయాలని ఉంది. కుర్చీ డైలాగ్‌ను సినిమాలో వాడుకుంటున్నామని సంగీత దర్శకుడు తమన్ ముందే మాతో చెప్పారు. అంతేకాదు ఆర్థిక సహాయం కూడా అందజేశారు’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ ‘కుర్చీ మడత పెట్టి’ డైలాగ్ కోసం తమన్ రూ.5వేలు షేక్ అహ్మద్ పాషాకు అందించారట. ఇక సినిమా విషయానికొస్తే.. అన్ని హంగులు పూర్తి చేసుకున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Keep up the Same High Energy & Excitement! 🤩🤙
Our SUPER🌟 @urstrulyMahesh & @sreeleela14 Mental Mass Steps will be a Feast 🕺💃
Full song out Today at 04:05 PM!🤩
Mamulu ga Undadu 🔥🔥🔥
A @MusicThaman Musical 🎹
✍️ #RamajogayyaSastry… pic.twitter.com/03yCKkhPAQ— Haarika & Hassine Creations (@haarikahassine) December 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.