Thalapathy vijay : బిగ్ షాక్.. కోలీవుడ్‌లో మరో స్టార్ జంట విడిపోనున్నారా..?
కొంతమంది వివాహబంధంతో పెళ్లిపీటలెక్కుతుంటే మరికొంతమంది విడిపోతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నప్పటికీ కొంతమంది వార్తలు మాత్రం షాక్ కు గురి చేస్తున్నాయి.

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో ఓ వైపు పెళ్లి బాజాలు మోగుతుంటే మరోవైపు విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది వివాహబంధంతో పెళ్లిపీటలెక్కుతుంటే మరికొంతమంది విడిపోతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నప్పటికీ కొంతమంది వార్తలు మాత్రం షాక్ కు గురి చేస్తున్నాయి. ఇటీవలే తమిళ్ స్టార్ హీరో ధనుష్ అతని భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడిపోయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఈ జంట తమ 18ఏళ్ల వివాహబంధానికి స్వస్తి పలికారు. ఇక ఇప్పుడు మరో స్టార్ జంట విడిపోతున్నట్టు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ జంట ఎవరో కాదు స్టార్ హీరో దళపతి విజయ్ ఆయన భార్య సంగీత. విజయ్ సంగీత తమ 22 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకనున్నారని, త్వరలోనే విడాకులను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారానికి కారణం ఏంటంటే ఇటీవల జరిగిన దళపతి విజయ్ వారసుడు తమిళ్ లో వారిసు ప్రీరిలీజ్ ఈవెంట్ కు విజయ్ సతీమణి సంగీత హాజరు కాలేదు. అలాగే మొన్నామధ్య స్టార్ డైరెక్టర్ అట్లీ భార్య సీమంతానికి కూడా ఆమె హాజరుకాలేదు. విజయ్ ఒక్కడే ఆ ఫంక్షన్ కు వెళ్ళాడు. దాంతో ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయని విడిపోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.




అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ సతీమణి పిల్లలతో విదేశాల్లో ఉన్నారు. త్వరలోనే విజయ్ కూడా వారితో జాయిన్ అవ్వనున్నాడు. అందువల్లే ఇక్కడ కనిపించడం లేదు. 1999లో విజయ్ సంగీతను పేమించి పెళ్లాడారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇలా కోలీవుడ్ లో ఓ నిజం లేని వార్త చక్కర్లు కొడుతోంది. ఇక విజయ్ నటించిన వారిసు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.