
తెలుగు సినీప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తీసుకువస్తుంది ఆహా. సినిమాలు, వెబ్ సిరీస్లతోపాటు జనాలు మెచ్చే గేమ్ షోస్, రియాల్టీ షోలను అందుబాటులోకి తెస్తుంది. ఇప్పటికే పలు ప్రోగ్రామ్స్ తో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సింగింగ్ టాలెంట్ ఉన్న ఎంతో మంది ప్రతిభావంతులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ షోతో ఇప్పటికే ఎంతో మంది గాయనీగాయకులను పరిచయం చేసిన ఆహా.. ఇప్పుడు ఈ షో సీజన్ 4 తీసుకువస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులను, ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుకున్న సింగింగ్ రియాల్టీ షో ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సీజన్ 4 అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ షో సీజన్ 4 కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా వరుస పోస్టులతో అప్డేట్స్ ఇస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..
తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేసారు. తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక వేదిక కోసం ఎదురుచూసే యంగ్ సింగర్స్ కోసం ఈ షోను తీసుకువచ్చారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కోసం ఇప్పటికే అడిషన్స్ సైతం జరిగాయి. చాలా మంది యంగ్ సింగర్స్ ఈ సీజన్ 4లో పాల్గొన్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఎప్పటిలాగే ఈ సీజ్ కు తమన్, కార్తీక్, గీతా మాధురి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ షోలో సింగర్ శ్రీరామచంద్రతోపాటు సింగర్ సమీరా సైతం హోస్టింగ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..
తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్లు తమ పాటలతో జడ్జీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సింగర్స్ ను ఒకరిని మించి మరొకరు పాటలు పాడారు. ఒక్కొక్కరు అద్భుతమైన పాటలతో ఆకట్టుకున్నారు. అలాగే మిరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో తేజా సజ్జా సైతం సందడి చేశారు. అలాగే ఒక కంటెంస్టెంట్ తో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు తమన్. చిన్నప్పటి నుంచి కంటి చూపు లేని ఓ కంటెస్టెంట్ కు కార్తీక్ తో కలిసి సాయం చేస్తానని మాటిచ్చారు తమన్. తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. ఆగస్ట్ 29 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది.
ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..