Vaddepalli Krishna: ఇండస్ట్రీలో విషాదం.. సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత..
40కి పైగ నృత్య రూపకాలను రాశారు. ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వడ్డేపల్లి కృష్ణ మృతిపై సినీ ప్రముఖులు, రచయితలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రచయితగానే కాకుండా సినీ పరిశ్రమలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కడికి వెళ్తుందో మనసు చిత్రానికి డైరెక్షన్ చేశారు. ఇందులో సాయి కుమార్ హీరోగా నటించారు. ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బలగం సినిమాలో వడ్డేపల్లి కృష్ణ కీలకపాత్రలో కనిపించారు.
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ (76) కన్నుమూశారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనను రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సినారె ఇష్టపడిన రచయిత వడ్డేపల్లి కృష్ణ. పదివేల లలిత గీతాలను పరిశీలించి ఆయన హీహెచ్డీ పూర్తి చేశారు. వందలాది లలిత గీతాలు, ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారమ్యయాయి. అలాగే 40కి పైగ నృత్య రూపకాలను రాశారు. ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వడ్డేపల్లి కృష్ణ మృతిపై సినీ ప్రముఖులు, రచయితలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రచయితగానే కాకుండా సినీ పరిశ్రమలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కడికి వెళ్తుందో మనసు చిత్రానికి డైరెక్షన్ చేశారు. ఇందులో సాయి కుమార్ హీరోగా నటించారు. ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బలగం సినిమాలో వడ్డేపల్లి కృష్ణ కీలకపాత్రలో కనిపించారు. ఇప్పటివరకు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఆటా, తానా వేడుకలలోనూ ప్రతి ఏడాది సాహిత్య చర్చల్లోనూ పాల్గొన్నారు.
గోభాగ్యం అనే లఘు చిత్రానికి అంతర్జాతీయంగా పలు పురస్కారాలు లభించాయి. బతుకమ్మ, రామప్ప రామణీయం వంటి చిత్రాలకు నంది పురస్కారాలు అందుకున్నారు. వడ్డేపల్లి కృష్ణ తెలంగాణలోని సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నాగోల్ లో స్థిరపడ్డారు. మొదట్లో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసిన ఆయన ఆ తర్వాత సినీ రంగంవైపు అడుగులు వేశారు. పిల్ల జమీందార్ చిత్రంలో నీ చూపులోనా విరజాజి వాన పాట రాశారు. అలాగే జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.