Andhra Pradesh: ఏపీలో మళ్లీ తెరపైకి సినిమా టికెట్ల వివాదం.. ఆ విధానంతో ఇబ్బందులున్నాయని ఎగ్జిబిటర్ల ఆందోళన..!

Andhra Pradesh: ఏపీలో ముగిసిపోయిన సినిమా టికెట్ల విధానం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుత విధానంతో తమకు ఇబ్బందులు ఉన్నాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

Andhra Pradesh: ఏపీలో మళ్లీ తెరపైకి సినిమా టికెట్ల వివాదం.. ఆ విధానంతో ఇబ్బందులున్నాయని ఎగ్జిబిటర్ల ఆందోళన..!
Movies
Follow us

|

Updated on: Jun 17, 2022 | 5:47 AM

Andhra Pradesh: ఏపీలో ముగిసిపోయిన సినిమా టికెట్ల విధానం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుత విధానంతో తమకు ఇబ్బందులు ఉన్నాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటోంది. షో పడకపోతే.. పబ్లిక్ కి డబ్బులు తిరిగివ్వడం కష్టమౌతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా చిన్న ఎగ్జిబిటర్లకు ప్రభుత్వ ఆన్ లైన్ టికెటింగ్ విధానం కొంత ఇబ్బందికరంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం ద్వారా బుకింగ్ డబ్బులు నేరుగా ప్రభుత్వానికి వెళ్తున్నాయని, అక్కడ నుంచి ఎగ్జిబిటర్లకు డబ్బు చేరడానికి కొంత సమయం పడుతోందన్నారు. రోజూవారీ వడ్డీకి అప్పు తీసుకొచ్చి సినిమా ఆడించే ఎగ్జిబిటర్లకు ఈ విధానంలో తీవ్రంగా నష్టం జరుగుతున్నట్టు చెప్తున్నారు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు.

ఛాంబర్ ద్వారా పనేచేసే ఆన్ లైన్ సాఫ్ట్‌వేర్ పనితీరు బాగుందంటున్నారు. బుక్ మై షో లాంటి ప్రైవేట్ యాప్స్ ముందే అడ్వాన్స్ ఇచ్చి మరీ సర్వీసులు అందిస్తున్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులు చెప్తున్నారు. తమ అభ్యంతరాలను తెలియపరుస్తూ.. ఎఫ్డీసీ చైర్మన్లకు మెమొరాండమ్ అందజేసింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అంతే కాకుండా మరికొద్ది రోజుల్లో ఆన్‌లైన్ టికెట్ల అంశంపై ఏపీలోని అన్ని జిల్లాల ఎగ్జిబిటర్లతో సమావేశం నిర్వహించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లాన్ చేస్తోంది.