‘సైరా’పై రగడ..విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బుధవారం మూవీ రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. ముందు బయోపిక్ అని చెప్పి ఆ తర్వాత ఈ సినిమా ఎవరి జీవితంపై తెరకెక్కింది కాదని సైరా చిత్ర యూనిట్ ప్రకటించడంతో తమిళనాడుకు చెందిన తెలుగు సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమా విడుదల చేయోద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఇక చిత్ర నిర్మాత […]

  • Ram Naramaneni
  • Publish Date - 2:29 pm, Tue, 1 October 19
‘సైరా'పై రగడ..విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బుధవారం మూవీ రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. ముందు బయోపిక్ అని చెప్పి ఆ తర్వాత ఈ సినిమా ఎవరి జీవితంపై తెరకెక్కింది కాదని సైరా చిత్ర యూనిట్ ప్రకటించడంతో తమిళనాడుకు చెందిన తెలుగు సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమా విడుదల చేయోద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఇక చిత్ర నిర్మాత రామ్ చరణ్ తమని మోసం చేశారని.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తీసుకున్నందుకుగానూ తమకు సొమ్ము చెల్లిస్తానని చెప్పి మోసం చేశారని ఉయ్యాలవాడ వారసులు కూడా కోర్టు మెట్లు ఎక్కారు. వీటిపై హైకోర్టు స్పందించింది.  సినిమా చూడాలా లేదా అనే విషయం ప్రజలపై ఆధారపడి ఉంది. రిలీజ్‌కు ఒక రోజు ముందు ఈ సినిమాను ఆపలేమని స్పష్టం చేస్తూ జడ్డిమెంట్ ఇచ్చింది.