‘సైరా’ ఫస్ట్ ప్రివ్యూ: టార్గెట్ నేషనల్ అవార్డేనా..?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు.. చూద్దామా అని మోగాస్టార్ అభిమానులు.. ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా.. మరికొద్ది గంటల్లోనే.. సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొద్ది రోజుల ముందు విడుదలైన ట్రైలర్ దుమ్మురేపింది. ఎన్నో అంచనాలను కూడా పెంచేసింది. ‘స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా.. సైరాను’ తీశారు చిరంజీవి యూనిట్. అయితే.. ఈ సందర్భంగా.. యూకే సెన్సార్ […]

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు.. చూద్దామా అని మోగాస్టార్ అభిమానులు.. ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా.. మరికొద్ది గంటల్లోనే.. సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొద్ది రోజుల ముందు విడుదలైన ట్రైలర్ దుమ్మురేపింది. ఎన్నో అంచనాలను కూడా పెంచేసింది. ‘స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా.. సైరాను’ తీశారు చిరంజీవి యూనిట్.
అయితే.. ఈ సందర్భంగా.. యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ‘సైరా’ సినిమాపై ఆసక్తికరమై కామెంట్స్ చేశారు. సినిమా చూసిన ఆయన.. అభిమానులతో తన అభిప్రాయలను.. సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా చూస్తున్నంత సేపూ.. రోమాలు నిక్కబొడుచుకున్నాయని.. చిరంజీవి చాలా గ్రేట్‌గా.. కథలో ఇమిడిపోయారని అన్నారు. అసలు నిజంగా.. నేషన్ అవార్డే.. మెగాస్టార్ కోసం వెయిట్ చేస్తుందా..! అన్నట్టుగా ఆయన జీవించారని చెప్పుకొచ్చారు. ప్రతీ సన్నివేశం.. ఎంతో అద్భుతంగా.. అందరూ చాలా చక్కగా నటించారని అన్నారు. మొదటిసారిగా.. చారిత్రక పాత్రలో నటించిన.. చిరు పేరు.. చరిత్రలో.. నిలిచిపోతుందని.. ఉమైర్ సంధు పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయమని.. సైరా సినిమా.. ఎంతో వీరోచితంగా రూపొందించారని తెలిపారు. ముఖ్యంగా నర్సింహా రెడ్డి ‘వార్’ సన్నివేశాలు ఎంతో అత్యంత్భుతంగా తీశారని కొనియాడారు.
సురేందర్ రెడ్డి ‘సైరా’ సినిమాను దర్శకత్వం వహించగా.. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. సైరాలో.. లెజండరీ యాక్టర్ అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా తదితరులు నటించారు.
#SyeRaNarasimhaReddy from Overseas Censor ! #Chiranjeevi is stupendous and clearly in top form. He holds you attentive right from the first frame till the penultimate moments. The supporting cast is top notch, especially #AmitabhBachchan [terrific], #Sudeep [wonderful]. ⭐⭐⭐⭐
— Umair Sandhu (@UmairFilms) September 29, 2019



