AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : తెలంగాణలో పెద్ది సినిమా టికెట్‌ ధరలు పెంపు.. ప్రీమియర్ షోలకు అనుమతి..

మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది మరికొన్ని గంటల్లో అడియన్స్ ముందుకు రాబోతుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో చరణ్ పల్లెటూరి నేపథ్యంలో విభిన్న అవతారాలలో కనిపించనుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Peddi Movie : తెలంగాణలో పెద్ది సినిమా టికెట్‌ ధరలు పెంపు.. ప్రీమియర్ షోలకు అనుమతి..
Peddi
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2026 | 7:26 AM

Share

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రత్యేక షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ ధరల వివరాలు , స్పెషల్ షోలుప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. జూన్ 4వ తేదీ నుండి 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో: టికెట్ ధరపై రూ. 100 పెంచుకునేందుకు అనుమతి లభించింది. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై రూ. 125 పెంచుకునేందుకు వీలు కల్పించారు. ప్రీమియర్ షోలు జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల నుండి ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షో టికెట్ ధరను గరిష్ఠంగా రూ. 600 (GSTతో కలిపి) గా నిర్ణయించారు. దీనితో పాటు సినిమా విడుదలైన మొదటి పది రోజులు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.

ఉత్కంఠకు తెరగత కొన్ని రోజులుగా తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం రావడంతో ఇటు చిత్ర యూనిట్, అటు ఎగ్జిబిటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధమైన ధరల పెంపునకు అనుమతి లభించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ డా. శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బాలీవుడ్ నటులు బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, రవి కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కథను సిద్ధం చేయడానికి, సినిమాను తెరకెక్కించడానికి దాదాపు 5 ఏళ్లు శ్రమించారు. ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, గుండెల్ని పిండేసే ఎమోషన్స్‌తో సాగుతుందని ఆయన తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us