మహిళా ఎంపీతో అసభ్య ప్రవర్తన, క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
జాదవ్‌పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టాక్సీ డ్రైవర్‌ను కోల్‌కతాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
జాదవ్‌పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టాక్సీ డ్రైవర్‌ను కోల్‌కతాలో పోలీసులు అరెస్ట్ చేశారు. తన కారులో ప్రయాణిస్తుండగా సదరు టాక్సీ డ్రైవర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఎంపీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఘటన హరిహయత్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం జిమ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఎంపీ మిమి చక్రవర్తి కారును ఓ టాక్సీ డ్రైవర్ ఫాలో అయ్యాడు. అంతేగాక, అతడు తన టాక్సీని.. ఎంపీ కారుకు దగ్గరగా తీసుకువచ్చి అసభ్యకరంగా సైగలు చేశారు. అయితే, తొలుత అతన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు ఎంపీ. అయినా, ఆ టాక్సీ డ్రైవర్ ఓవర్ చెయ్యడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎంపీ ఫిర్యాదు మేరకు నిందితుడైన టాక్సీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
‘నాతో అసభ్యంగా ప్రవర్తిస్తే మొదట లైట్ తీసుకున్నా. కానీ అతడిని అలాగే వదిలేస్తే ఆ టాక్సీలో ప్రయాణించే మహిళలకు కూడా రక్షణ ఉండదని భావించి పోలీసులకు కంప్లైంట్ చేశాను. అందుకే అతడి కారును వెంబడించి పట్టుకుని మరీ పోలీసులకు అప్పగించాను’ అని మిమి చక్రవర్తి తెలిపారు. కాగా, మిమి చక్రవర్తి ఓ వైపు ఎంపీగా కొనసాగుతూనే పలు టీవీ కార్యాక్రమాల్లో కనిపిస్తున్నారు.
Also Read :
టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు కన్నుమూత