Tasty Teja: ‘వరదల్లో చిక్కుకుపోయాం.. ప్లీజ్ హెల్ప్ చేయండి’.. బిగ్ బాస్ ఫేం టేస్టీ తేజా వీడియో వైరల్

|

Sep 03, 2024 | 2:29 PM

సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ చాలామంది సహాయం కోసం అల్లాడుతున్నారు. పాలు, నీళ్లు, ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద నీటితో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫేం, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

Tasty Teja: వరదల్లో చిక్కుకుపోయాం.. ప్లీజ్ హెల్ప్ చేయండి.. బిగ్ బాస్ ఫేం టేస్టీ తేజా వీడియో వైరల్
Tasty Teja
Follow us on

భారీ వర్షాలకు తోడు బుడమేరు వాగు పొంగడంతో విజయవాడ నగరం నీట మునిగింది. వరద నీరు ధాటికి అపార్టుమెంట్ల సెల్లార్లు పూర్తిగా మునిగిపోయాయి. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షలాదిమంది నిరాశ్రయులై ఆకలితో అల్లాడుతున్నారు. మరోవైపు వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు పునరావాస కేంద్రాలకు పడవల సహాయంతో తరలిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ చాలామంది సహాయం కోసం అల్లాడుతున్నారు. పాలు, నీళ్లు, ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద నీటితో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫేం, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో చైతన్య అనే వ్యక్తి.. తాము వరదలో చిక్కుకుపోయామని, తమను ఎవరైనా ఆదుకోవాలని కోరుతున్నాడు. విజయవాడలో అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ సమీపంలోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్నామని, తమ ఇంటిని భారీ వరద చుట్టుముట్టిందని బాధితుడు వాపోయాడు.

10 రోజుల క్రితమే పుట్టిన బిడ్డ, పాప, హార్ట్ పేషంట్స్, పసిపిల్లలు, ఆడవాళ్లు, అంతా ఇరుక్కుపోయామని, మూడురోజులుగా తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నామని బాధితులు వాపోయారు. పసిపిల్లల ఆకలిని తీర్చేందుకు కూడా పాలు, నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా కూడా లేదని, మొబైల్స్ కూడా స్విచ్ఛాఫ్ అయిపోతుందన్నారు. అధికారులు వీలైనంత త్వరగా తమను పునరావాస కేంద్రానికి తరలించాలని వేడుకున్నారు. 916013339, 8977273699 నంబర్లకు కాల్ చేస్తే అడ్రస్ చెబుతామన్నారు. లేదంటే శ్రీ నాగలక్ష్మీ నిలయం, అమూల్ ఐస్ క్రీమ్ బిల్డింగ్, R.S.259/5, plot no , పాముల కాలవ, క్యాపిటల్ వే అపార్ట్ మెంట్, జక్కంపూడి రోడ్ అడ్రస్ కు వచ్చి తమను రక్షించాలని చైతన్య విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజా షేర్ చేసిన వీడియో ఇదిగో..

 

ప్రస్తుతం టేస్టీ తేజా షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ప్రభుత్వం లేదా ఎవరైనా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.