AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: విలన్‏గా మారనున్న సూర్య.. ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సరికొత్త అవతారం..

మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో సూర్య... గ్యాంగ్ లీడర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతోపాటు హిందీలో తెరకెక్కుతున్న సింగం మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే కాకుండా ఇప్పుడు హిందీలో మరో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడట. అయితే ఈసారి హీరోగా కాదు.. విలన్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది.

Suriya: విలన్‏గా మారనున్న సూర్య.. ఆ స్టార్ హీరోను ఢీకొట్టేందుకు సరికొత్త అవతారం..
Suriya
Rajitha Chanti
|

Updated on: Sep 17, 2024 | 1:26 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు కంగువ షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ హీరో.. అటు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన 44వ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో సూర్య… గ్యాంగ్ లీడర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతోపాటు హిందీలో తెరకెక్కుతున్న సింగం మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే కాకుండా ఇప్పుడు హిందీలో మరో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడట. అయితే ఈసారి హీరోగా కాదు.. విలన్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది.

బీటౌన్ ఇండస్ట్రీలో 2004లో విడుదలైన ధూమ్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. బైక్ రేసింగ్స్, కారు చేజింగ్ లతో సరికొత్త యాక్షన్ ప్రేక్షకులకు చూపించారు. ఇక ఈ తర్వాత రెండేళ్ల గ్యాప్ లోనే వచ్చిన ధూమ్ 2 సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక దీంతో ధూమ్ 3 చిత్రాన్ని కూడా అడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ధూమ్ 2, 3 చిత్రాలకు చాలా కాలం గ్యాప్ వచ్చింది. 2016లో రిలీజ్ అయిన ధూమ్ 3 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ విడుదలై ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ ధూమ్ 4పై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది.

ధూమ్ 1, 2, 3 చిత్రాలను అందించిన ఆదిత్య చోప్రా ఇప్పుడు ధూమ్ 4 కోసం కథను రెడీ చేస్తున్నాడట. గతంలో వచ్చిన మూడు పార్ట్స్ కంటే ఈసారి ధూమ్ 4 వేరేలెవల్ ఉంటుందని టాక్. అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారు అనే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ తమిళ్ హీరో సూర్య ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే యశ్ రాజ్ ఫిల్మ్స్ సూర్యతో సంప్రదింపులు చేశారని తెలుస్తోంది. విలన్ గా నటించేందుకు సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us