Lokesh Kanagaraj: కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ‘లియో’ డైరెక్టర్.. సినిమాలపై లోకేష్ కీలక నిర్ణయం..

మానగరం సినిమాతో తమిళంలో దర్శకుడిగా అరంగేట్రం చేసిన లోకేష్ కనగరాజ్.. కార్తీతో ఖైదీ, విజయ్ దళపతితో మాస్టర్, కమల్ హాసన్ తో విక్రమ్, మళ్లీ దళపతితో లియో చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ 171 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోలకు, దర్శకులకు అభిమానులను సృష్టించడంలో లోకేష్ కనగరాజ్ పాత్ర చాలా పెద్దది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సినిమాటిక్ యూనివర్స్ జానర్ ను పరిచయం చేయడంలో లోకేష్ కీలకపాత్ర పోషించారు.

Lokesh Kanagaraj: కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన 'లియో' డైరెక్టర్.. సినిమాలపై లోకేష్ కీలక నిర్ణయం..
Lokesh Kanagaraj
Follow us

|

Updated on: Nov 28, 2023 | 11:11 AM

కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్. తమిళంలో తెరకెక్కించింది కేవలం 5 సినిమాలు మాత్రమే. కానీ అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఇక కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి కాంబోలో లోకేష్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా గురించి చెప్పక్కర్లేదు. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లె ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో లోకేష్ దర్శకత్వం వహించే మూవీస్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మానగరం సినిమాతో తమిళంలో దర్శకుడిగా అరంగేట్రం చేసిన లోకేష్ కనగరాజ్.. కార్తీతో ఖైదీ, విజయ్ దళపతితో మాస్టర్, కమల్ హాసన్ తో విక్రమ్, మళ్లీ దళపతితో లియో చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ 171 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోలకు, దర్శకులకు అభిమానులను సృష్టించడంలో లోకేష్ కనగరాజ్ పాత్ర చాలా పెద్దది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న సినిమాటిక్ యూనివర్స్ జానర్ ను పరిచయం చేయడంలో లోకేష్ కీలకపాత్ర పోషించారు. ఖైదీతో మొదలైన ఈ యూనివర్స్ లియో వరకు కొనసాగింది.

ఇక ఆ తర్వాత సూర్య ప్రధాన పాత్రలో రోలెక్స్ పాత్రతోనే మరో సినిమా చేయబోతున్నారు. కేవలం పది సినిమాలకు మాత్రం దర్శకత్వం వహించి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ అవుతానని ప్రకటించాడు లోకేష్. దీంతో అతని అభిమానులు నిరాశకు గురయ్యారు. తాజాగా తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు లోకేష్. ప్రస్తుతం దర్శకుడిగా కొనసాగుతున్న లోకేష్.. ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. జీ స్క్వాడ్ అనే నిర్మాణ సంస్థను అధికారికంగా ప్రకటించారు. ‘ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించిన తర్వాత నా సొంత నిర్మాణ సంస్థ జీ స్క్వాడ్ ను ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ నిర్మాణ సంస్త అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఫీచర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అంకితం చేయబడింది.’ అంటూ స్పెషల్ నోట్ షేర్ చేశారు.

ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన కొన్ని పనులు ముందుగా నా స్నేహితులు, అసోసియేట్స్ కోసం రిజర్వ్ చేయబడ్డాయి. వారి సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ నుండి వస్తున్న చిత్రాలను చూసి ఆనందిస్తూ ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మా మొదటి చిత్రం ప్రకటన కోసం వేచి ఉండండి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం లోకేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..