ఇటీవలే విరాట పర్వం (Virata Parvam) సినిమాతో సూపర్ హిట్ అందుకుంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi).. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నక్సలిజం నేపథ్యంలో అందమైన ప్రేమకావ్యాన్ని డైరెక్టర్ వేణు ఉడుగుల రూపొందించగా.. రానా దగ్గుబాటి హీరోగా నటించారు. ఇందులో నక్సలైట్ రవన్నగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించారు. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నుంచి మరే ప్రాజెక్ట్ అనౌన్స్ రాలేదు.. తాజాగా ఈ మలయాళ కుట్టి తమిళంలో ఓ సినిమా చేస్తుంది..
డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీకి గర్గి టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తమిళ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తుండగా.. డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి సాయి పల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో సూర్య సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తో దిగిన ఫోటోలను సైతం షేర్ చేశారు. ఇందులో కాళీ వెంకట్ ప్రదాన పాత్రలో నటిస్తున్నారు.
ట్వీట్…
Jo & I are glad to associate with team #Gargi Some characters just stay in our minds! New thoughts and writing must be celebrated!Hope you all like it!@Sai_Pallavi92 #Jyotika @prgautham83 #AishwaryaLekshmi #GovindVasantha @kaaliactor @SakthiFilmFctry @blacky_genie @2D_ENTPVTLTD pic.twitter.com/uWpGDmgpSp
— Suriya Sivakumar (@Suriya_offl) June 24, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.