Tamannaah: తమన్నా నిజంగానే ప్రేమలో పడిందా ?.. మరోసారి అతడితో కలిసి ఈవెంట్లో సందడి.. వీడియో వైరల్..

| Edited By: Ravi Kiran

Jan 21, 2023 | 8:58 AM

విజయ్ వర్మతో మిల్కీబ్యూటీ ప్రేమలో ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం ఇటీవల న్యూయర్ సెల్రబ్రెషన్స్‏ను వీరిద్దరు గోవాలో జరుపుకున్నారు.

Tamannaah: తమన్నా నిజంగానే ప్రేమలో పడిందా ?.. మరోసారి అతడితో కలిసి ఈవెంట్లో సందడి.. వీడియో వైరల్..
Tamannah
Follow us on

గత కొద్దిరోజులుగా తమన్నా ప్రేమాయణం గురించి సోషల్ మీడియా కూడై కూస్తోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీబ్యూటీ ప్రేమలో ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం ఇటీవల న్యూయర్ సెల్రబ్రెషన్స్‏ను వీరిద్దరు గోవాలో జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి.. అంతేకాకుండా.. అక్కడ విజయ్ వర్మకు తమన్నా ముద్దుపెడుతున్న వీడియో కూడా నెట్టింట హల్చల్ చేసింది. దీంతో వీరిద్దరు రిలేషన్‏లో ఉన్నారంటూ బీటౌన్‏లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు తమన్నా గానీ.. ఇటు విజయ్ వర్మగానీ స్పందించలేదు. ఇక తాజాగా మరోసారి వీరిద్దరు కెమెరాకు చిక్కారు.

ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన ఓ అవార్డ్ షోకు సంబంధించిన వీడియోలో తమన్నా.. విజయ్ వర్మ కనిపించారు. వీరిద్దరూ కలిసి ఆ వేడుకలో పాల్గొన్నట్లు వీడియో చూస్తే అర్దమవుతుంది. దీంతో మిల్కీబ్యూటీ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ తేల్చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ అవార్డ్స్ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. అలాగే లస్ట్ స్టోరీస్ 2 చిత్రంలోనూ కనిపించనుంది. అయితే ఇందులో విజయ్ వర్మ కూడా నటిస్తున్నారు. వీరిద్దరు మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే వీరిద్దరూ ఇలా కలిసి పార్టీలకు.. వేడుకలకు అటెండ్ కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో గతేడాది సింగర్ దిల్జిత్ దోసాంజ్ ముంబైలో ఇచ్చిన ప్రదర్శనలోనూ పాల్గోన్నారు తమన్నా. విజయ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.