Sye Raa: ‘ సైరా ‘ తో హిందీ ‘ మేకర్స్ ‘ కి తలనొప్పులు తప్పవా ?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చరిత్రాత్మక చిత్రం ‘ సైరా నరసింహారెడ్డి ‘ హిందీ డబ్డ్ వెర్షన్ హక్కులను బాలీవుడ్ పార్ట్నర్స్ ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిధ్వానీ కొనుక్కుని ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ వీరు ‘ తొందర పడ్డారని ‘, వీరి నిర్ణయం వల్ల లాభాలు రాకపోగా, నష్టాల బారిన పడవచ్ఛునని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. కన్నడ మూవీ ‘ కేజీహెచ్ ‘ సూపర్ సక్సెస్ కావడంతో ఆ సినిమా మీద ఇన్వెస్ట్ […]

Sye Raa: ' సైరా ' తో హిందీ ' మేకర్స్ ' కి తలనొప్పులు తప్పవా ?
Sye Raa Narasimha Reddy Release Date
Follow us

|

Updated on: Aug 19, 2019 | 12:07 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చరిత్రాత్మక చిత్రం ‘ సైరా నరసింహారెడ్డి ‘ హిందీ డబ్డ్ వెర్షన్ హక్కులను బాలీవుడ్ పార్ట్నర్స్ ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిధ్వానీ కొనుక్కుని ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ వీరు ‘ తొందర పడ్డారని ‘, వీరి నిర్ణయం వల్ల లాభాలు రాకపోగా, నష్టాల బారిన పడవచ్ఛునని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. కన్నడ మూవీ ‘ కేజీహెచ్ ‘ సూపర్ సక్సెస్ కావడంతో ఆ సినిమా మీద ఇన్వెస్ట్ చేసిన ఈ ఇద్దరూ ఇక తెలుగు చిత్రాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరు నటిస్తున్న ‘ సైరా నరసింహారెడ్డి ‘ హిందీ హక్కులను కొని.. బాలీవుడ్ ఆడియెన్స్ కి ‘ తెలుగు కల్చర్ ‘, తెలుగు హిస్టరీ గురించి కాస్త తెలియజెప్పాలనుకున్నారు. పైగా దీనివల్ల తమకు ‘ ఆర్థికంగా ‘ కూడా ప్రయోజనం కలుగుతుందని అనుకున్నారు. అంటే ఈ తెలుగు సినిమాను ఏక కాలంలో హిందీలోనూ రిలీజ్ చేయాలన్నది వారి ప్లాన్. . పైగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ‘ సైరా ‘ లో గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఇది హిందీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని భావించారు. కానీ ఇక్కడే చిక్కొచ్చి పడింది. కేజీహెచ్ చిత్రానికి, ఈ సినిమాకు మధ్య చాలా తేడా ఉంది. కేజీహెచ్ ఫిల్మ్ లో యాక్షన్ సీన్స్ ఎక్కువ.. కానీ హిస్టారికల్ మూవీ అయిన ‘సైరా ‘ లో డైలాగులు సుదీర్ఘంగా, తెలుగు నేటివిటీకి, వాతావరణానికి తగినట్టు ఉంటాయని, వాటిని హిందీ ఆడియెన్స్ ఆస్వాదించలేరని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. వీటిని వారు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. పైగా చరిత్రాత్మక చిత్రాలు తీయడంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి అనుభవం కూడా లేదన్నది వీరి అభిప్రాయం. దీంతో ఫర్హాన్, రితేష్ లకు హిందీ హక్కులు కొన్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్ఛునని అంటున్నారు. అయితే మెగాస్టార్ తో బాటు సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా, అనుష్క శెట్టి వంటి హేమాహేమీలు నటిస్తున్న ‘ సైరా నరసింహారెడ్డి ‘ కి మాత్రం ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్స్ బాప్ రే అనేట్టు ఉన్నాయి.చిత్రంలో… చిరు, నయనతార, అమితాబ్ ఓ హోమం లో పాల్గొన్నట్టుగా ఉన్న సీన్ ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. Sye Raa Chiranjeevi

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?