AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె సీత ఏంటి.. నా పక్కన ఆనదు.! మార్చేయండి..! నటుడి మాటలకు సెట్‌లో అందరూ షాక్

రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలని మంచి విజయాలను అందుకున్నాయి. చాలా మంది హీరోలు , హీరోయిన్స్ రాముడిగా, సీత నటించి మెప్పించారు. దాదాపు రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అందరూ రాముడిగా, సీతగా కూడా అలరించారు .

ఆమె సీత ఏంటి.. నా పక్కన ఆనదు.! మార్చేయండి..! నటుడి మాటలకు సెట్‌లో అందరూ షాక్
Movie
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2026 | 8:42 AM

Share

రామాయణం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ రాముడి సీతాగా నటించారు. అయితే  ఆమె సీత ఏంటి డామిట్ తీసేయండి, నా పక్కన ఆనదు! అని ఓ నటుడు చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఈ వ్యాఖ్యలు చేసిన ఆ నటుడు ఎవరో కాదు దిగ్గజ నటుడు ఎస్.వి. రంగారావు ఒక సినిమాలో అన్నారట. ఈ ఆసక్తికరమైన సంఘటన బాపు-రమణ దర్శకత్వంలో రూపొందిన “సంపూర్ణ రామాయణం” చిత్రం చిత్రీకరణ సమయంలో చోటు చేసుకుందట. ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో ఎస్.వి. రంగారావు నటించగా.., సీతమ్మ పాత్రలో చంద్రకళ కనిపించారు. రంగారావు గారు సెట్‌లోకి అడుగుపెట్టగానే, సీత పాత్రలో జమున కాకుండా మరొక నటిని (చంద్రకళ) చూసి ఆశ్చర్యపోయారట.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

ఈమె సీత ఏంటి అని ప్రశ్నిస్తూ, చంద్రకళ బక్కచిక్కిపోయి ఉండటం వల్ల ఈమె కోసం పోయి పోయి నేను యుద్ధం చేస్తే జనాలు నవ్వుతారు. నా పక్కన ఏ మాత్రం ఆనదు. త్వరగా సీతగా జమునను తీసుకురండి” అని అన్నారట రంగారావు . అయితే, బాపు-రమణ గారు మొదట జమునను కైకేయి పాత్ర కోసం సంప్రదించారట. సీత పాత్ర కోసం వేరొకరిని ఎంపిక చేసి, తనను కైకేయిగా అడగడంపై జమున మొదట కన్నెర్ర చేశారు. కానీ, సీత పాత్ర సినిమా మొత్తం మౌనంగా ఒకచోట కుదురుగా కూర్చునే పాత్ర అని, కైకేయి పాత్రలో అనేక వేరియేషన్స్ ఉన్నాయని బాపు-రమణ వివరించారట. దశరథుడి భార్యగా, రాముడిని కనకపోయినా పెంచిన తల్లిగా, చెప్పుడు మాటలు విని రాముడిని అడవులకు పంపిన గయ్యాళిగా, భర్తకు మాట ఇచ్చిన తల్లిగా, పంతం నెగ్గించుకున్న భార్యగా ఈ పాత్రకు విశేషమైన ప్రాధాన్యత ఉందని, జమున తప్ప మరెవరూ ఈ పాత్రను అంత గొప్పగా పండించలేరని వారు వివరించడంతో ఆమె ఒప్పకున్నారట.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

అలా జమున కైకేయి పాత్రకు అద్భుతంగా జీవం పోశారు జామున. ఈ చిత్రంలో చంద్రకళ సీత పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ సీతమ్మ అంటే కేవలం అంజలీదేవి గారే. ఆమె కన్ను మూసినప్పుడు పత్రికలు తెలుగుంటి సీతమ్మ కన్నుమూత అని పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి వేశాయంటే ఆమెను సీతగా ప్రజలు ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం కారణంగా రామాయణం అంశం మరోసారి చర్చకు వచ్చింది. సంపూర్ణ రామాయణం సినిమాకు నిడమర్తి మూర్తి గారు నిర్మాత. రచయిత చెన్నైలో ఉన్నప్పుడు ఆయనతో ఎక్కువ సమయం గడిపేవారని, ఆయన చాలా మంచి వ్యక్తి అని, ఈ సినిమా గురించి అనేక విషయాలు తన ఫియట్ కారులో ప్రయాణిస్తున్నప్పుడు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. నిడమర్తి మూర్తి గారు రాజమండ్రికి చెందినవారు.

ఇవి కూడా చదవండి

అరెరే..!! రంగమత్త పాత్ర ఎలా మిస్ చేసుకుంది.. ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us